రిపోర్టర్ : పవన్
లొకేషన్ : విజయవాడ
నేటి ఆధునిక యుగంలో రోజురోజుకీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు పెను విధ్వంసానికి దారితీస్తున్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాల్సిన సందర్భంలో వారి మధ్య ఏర్పడుతున్న భిన్నాభిప్రాయాలు ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పటడుగు వేసేలా ప్రేరేపిస్తున్నాయి. విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఇందుకు నిలువుటద్దంగా నిలుస్తుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
ఈ ఘటన విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో జరిగింది. రామవరప్పాడు దగ్గర కాలువ గట్టు ప్రాంతం తోటల్లో వాన రమణ (30) అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ తమ జీవనం కోసం తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇదే ప్రాంతంకి చెందిన మరో మహిళ పక్క వీధిలో మీసాల లక్ష్మి తన భర్త, ఇద్దరు కుమారులతో ఉంటుంది. రమణకి లక్ష్మికి మధ్య గత ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో జరిగింది. అప్పటివరకు అక్రమ సంబంధం కొనసాగుతున్నంత కాలం బాగానే ఉండగా.. లక్ష్మీ ఒక్కసారిగా పిల్లలు పెద్దవారు అవుతున్నారని వివాహేతర సంబంధం ఇక మీదట కుదరదని రమణను దూరం పెట్టేసింది. అలా దూరం పెట్టడంతో వారి మధ్య అనేక మార్లు గొడవలు జరిగాయి. లక్ష్మీ ఇక భరించలేక రమణపై పటమట పోలీస్ స్టేషన్‌లో రెండు సార్లు ఫిర్యాదు కూడా చేసింది. ఇది ఇలా ఉండగా లక్ష్మి రమణను దూరంగా పెట్టి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భావించిన రమణ అది భరించలేక బుధవారం మధ్యాహ్నం లక్ష్మి ఇంటికెళ్లి తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ఘర్షణకు దిగాడు.
సహనం కోల్పోయిన లక్ష్మి అక్కడే ఉన్న కూరగాయలు కోసే కత్తితో రమణ పొట్టలో పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున రమణ మృతి చెందాడు. లక్ష్మిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు రావడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉండగా రోజు రోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వాటి వల్ల ఏకంగా కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. రోజు టీవీలో చూస్తున్నా మార్పు ఏ మాత్రం రావడం లేదు. ఏళ్ల తరబడి అక్రమ సంబంధం కొనసాగించడం.. కొన్నాళ్ళకు వారిలో వారికే మనస్పర్థలు వచ్చి ఏకంగా చంపుకునే వరకు వెళ్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada