Home /News /andhra-pradesh /

VIJAYAWADA EX MLA VANGAVEETI RADHA MADE SENSATIONAL COMMENTS AS HE MADE ALLEGATIONS THAT SOME PLANNED TO KILL HIM FULL DETAILS HERE PRN

Vangaveeti Radha: నా హత్యకు కుట్ర చేశారు.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు.. కొడాలి నానితో మీటింగ్..

వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

కృష్ణాజిల్లా (Krishna District) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దివంగత నేత వంగవీటి మోహన రంగా (Vangaveeti Ranga) వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కృష్ణా జిల్లా (Krishna District) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దివంగత నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha)  సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. కొంతమంది తనను చంపేందుకు కుట్ర చేశారని రాధా బాంబు పేల్చారు. తాను దేనికైనా రెడీ అన్న రాధా.. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. రాధా ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాధాను చంపాల్సిన అవసరం ఎవరికుంది.. కుట్ర చేసిన వారి గురించి రాధాకు తెలుసా..? నిజంగానే రాధా మర్డర్ కు ప్లాన్ జరిగిందా..? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. రంగా వర్ధంతి రోజునే రాధా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రంగా-రాధా అభిమానులు, అనుచరుల్లో కలకలం రేగింది.

    రాధా ఏమన్నారంటే.. ” నన్ను ఏదో చెద్దామని అనుకునేవాళ్లకి.. తనను పొట్టనబెట్టుకుందాం అనే చూసేవాళ్లకు చెబుతున్నా.. తనను ఎవరూ ఏమీ చేయలేరు.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.. రంగా గారి తనయుడిగా నేను జనంలోనే ఉంటా.. నాకు హాని చేయాలని రెక్కి చేసిన వ్యక్తులెవరు అనేది త్వరలోనే తెలుస్తుంది” అని అన్నారు. తాను చెప్పింది నిజమో కాదో త్వరలోనే తెలుస్తుందని రాధా అన్నారు.

    ఇది చదవండి: సినిమా థియేటర్ కు ఎలాంటి అనుమతులుండాలి..? వచ్చేదెంత..? మిగిలేది ఎంత..?


    ఇదిలా ఉంటే వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి వంగవీటి రంగాకు నివాళులర్పించిన ఆయన.. కాసేపు వంశీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన జిల్లాలో పలుచోట్ల జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    ఇది చదవండి: వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్.. కేంద్రం చూస్తూ ఉరుకోదు.. సుజనా వార్నింగ్..


    ఇదిలా ఉంటే వంగవీటి రాధా.. మధ్యాహ్నం వంశీతో కలిసి గుడివాడ నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రి కొడాలి నాని వీరికి స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ కలిసి గుడ్లవల్లేరు మండలం వేమరంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదే మండలం చినగొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాధా.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    ఇది చదవండి: అమరావతిలో పెండింగ్ నిర్మాణాలపై ప్రభుత్వం క్లారిటీ.. కోర్టుకు ఏం చెప్పిందంటే..!


    వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. కొడాలి నాని వైసీపీలో ఉండగా వంశీ అధికార పార్టీతో క్లోజ్ గా ఉంటున్నారు. రాధా టీడీపీలో ఉన్నారు. ఈ ముగ్గురి కలయిక రాజకీయంగానూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే సమావేశంలో రాధాపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేయడంతో టీడీపీలోకి వెళ్లారని.. ఆ పార్టీ రాధాకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా.. రాధా మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారని అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. రాధా తనకు తమ్ముడి లాంటి వాడని అతనికి అన్ని విషయాల్లో తోడుంటామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kodali Nani, Vangaveeti Radha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు