Kodali Nani: తెలుగు దేశం (Telugu Desam) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) .. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani). లోకేష్ చేస్తున్న యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబు డి ఫాల్టర్ అయ్యారని అభిప్రాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించడంపైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తున్నారని.. మరోవైపు చంద్రబాబు మూడు రోజులుగా తూర్పుగోదావరిలో తిరుగుతున్నారు కొడుకు పాద యాత్ర చూసి తండ్రి తల పట్టుకునే పరిస్థితి నెలకొంది అన్నారు. కొడుకు చేస్తున్న పాదయాత్రను ప్రజలు పట్టించుకోవకపోవడంతో.. బాబు డి ఫాల్టర్ అయ్యారని కొడాలి నాని విమర్శించారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. కొడాలి నాని బూతులు మాట్లాడతాడని తనను టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఇవాళ లోకేష్ భాష ఎలా ఉంది అని ప్రశ్నించారు.
జగన్‌ను రాయలసీమలోనే పుట్టావా..? అని లోకేష్ ప్రశ్నిస్తున్నారని.. అదే మాట మేము అంటే గోలగోల చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ డిఎన్ఏ రాయలసీమ.. లోకేష్ డిఎన్ఏ తెలంగాణ .. లోకేష్ తెలంగాణలో పుట్టి ఇక్కడ ఎందుకు..? హడావుడి చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవ చేశారు.
రాయలసీమలో పుట్టిన పులి బిడ్డ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లోకేష్ చరిత్ర అందరికీ తెలిసిందే..? తెలంగాణలో పుట్టిన లోకేష్.. తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గం చూసుకోవాలి అన్నారు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి ఈ ప్రాంతం సంస్కృతి తెలియని లోకేష్.. అక్కడే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి అంటే ఫైర్ అయ్యారు కొడాలి నాని..
మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. సీఎం జగన్ గురించి దారుణ పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి పిచ్చి పట్టినట్లు ఉందని, అందుకే సీఎం జగన్ ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా నీటితో నిండలేదని నాని విమర్శించారు.
ఇదీ చదవండి : ఏపీ బీజేపీలో మరో వివాదం.. ఎంపీ జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్
నువ్వు సైకోవి. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగలించి, ఆయన ట్రస్టులను దొంగలించి, ఆ పార్టీకున్న డబ్బులను దొంగిలించి అనాథను చేసి ఒక ముసలాయనను చంపిన సైకో చంద్రబాబు. సైకోలకే సైకోవి నువ్వు. జగన్ ని సైకో అంటావా? చంద్రబాబు వెన్నుపోటు దారుడు, అవినీతి చక్రవర్తి అని మహానుభావుడు ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ ను చంపి ఆయన బొమ్మలను దండలు వేసి నీతి కబుర్లు చెబుతావా?” అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కొడాలి నాని.
ఇదీ చదవండి : జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?
అంతకుముందు కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్ 10 ఇచ్చి 100 లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిలువు దోపిడీకి ప్రజలు బలయిపోతున్నారని.. తన జీవితంలో ఇంత దోపిడీదారున్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలే కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Nara Lokesh, TDP