హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని.. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..

Kodali Nani: డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని.. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..

ఆర్టీసీ బస్సు నడిపిన కొడాలి నాని

ఆర్టీసీ బస్సు నడిపిన కొడాలి నాని

Kodali Nani: పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి కొడాలి నాని ఏం చేసినా ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం నోటికి పని చెప్పడమే కాదు.. అప్పుడప్పుడు స్టైల్ మార్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు.. తాజాగా బస్ డ్రైవర్ అవతారం ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచారు.. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైపీపీ (YCP) పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minister Kodali nani) చేసిన పని చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఆయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.. ప్రత్యర్థులపై మాటల దాడి చేయడం విషయంలో నైనా కొడాలి నాని తరువాతే ఎవరైనా..? అయితే మంత్రి పదవి పోయిన తరువాత కాస్త సైలెంట్ అయిన నాని.. ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచారు. ఇటీవల సీఎం జగన్ మోహన్  రెడ్డి (CM Jagan Mohan Reddy) క్లాస్ పీకడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ప్రత్యర్థులపై మాటల దాడి పెంచారు. అలాగే నియోజకవర్గంలోనే పూర్తి యాక్టివ్ అవుతున్నారు. తాజాగా గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడిపారు. ఎదో ఫోటోలకు.. వీడియోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. నిజంగానే చాలా అనుభవం ఉన్న డ్రైవర్ లా సునాయాసంగా బస్సును ప్రధాన రహదారిపై నడుపుతూ కొడాలి నాని హల్చల్ చేశారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా లోని గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లె వెలుగు బస్సులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. గుడివాడ ఆర్టీసీ డిపోకు కొత్తగా వచ్చిన ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే కొడాలి నాని హల్చల్ చేశారు.

ఆయన అలా అనుభవం ఉన్న డ్రైవర్ లా బస్సును నడపడం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నూతన సర్వీసులు గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి.

బస్పు డ్రైవింగ్ చేసిన తరువాత.. ఎమ్మెల్యే కోడలి నాని మాట్లాడుతూ.. దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. సీఎం జగన్ ఈ పథకాన్ని దళితుల కోసం కేటాయించడంతో చాలామంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ.. శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర.. ప్రత్యేకత ఇదే..?

రాష్ట్రంలో ప్రత్యేకంగా దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ.. కొడాలి నాని ప్రశంసల వర్షం కురిపించారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Apsrtc, Kodali Nani, Ycp

ఉత్తమ కథలు