Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) మళ్లీ మునుపటి ఫాంలోకి వచ్చేశారు.. వదల బొమ్మాళి అంటూ రోజూ చంద్రబాబు నాయుడు (Chanrababu Naidu) ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా బాలకృష్ణ (Balakrishna) పైనా నిప్పులు చెరుగుతున్నారు. గత మూడు రోజుల రోజుల నుంచి గ్యాప్ లేకుండా.. బావ, బావ మరిదిని టార్గెట్ చేస్తూ.. తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కన్నతండ్రిని చంపిన వ్యక్తికి బాలయ్య మద్దతుగా నిలవడం దారుణమన్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పేంటి.. చంద్రబాబు నాయుడు కూతురిని ఇచ్చి పెళ్లి చేయడమా..? ఆస్తులు, మంత్రి పదవి ఇవ్వడమా..? బాలయ్యకు జన్మ నివ్వడమా.. సినిమాల్లో స్టార్ హోదా కల్పించడమా..? సీనియర్ ఎన్టీఆర్ అసలు ఏం తప్పు చేశారు. అంటూ మండిపడ్డారు. చనిపోయి 25 ఏళ్ల తరువత కూడా ఆయన ఏదో తప్పు చేశారని ప్రజల్లో నిరూపించే ప్రయత్నం చేయడం దారుణం అంటూ అత్యంత దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విశ్వాసం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వారు చంద్రబాబు నాయుడే అని.. తాను నిత్యం విశ్వాసంతోనే ఉంటాను అన్నారు. చంద్రబాబు తనకు రాజకీయ జీవితం ఇచ్చారన్నవాస్తవం కాదన్నారు.
రాజకీయాల్లోని తనను తీసుకొచ్చింది హరికృష్ణ అని గుర్తు చేశారు. తరువాత తనకు సీటు ఇప్పించి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అందుకే తనకు సీనియర్ ఎన్టీఆర్ అన్నా.. ఆ కుటుంబం అంటే అంత గౌరవం అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ని, హరికృష్ణను గౌరవిస్తాను అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం ఉందన్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో విబేధాలు ఉన్నాయని.. అయినా తామిద్దరం మట్లాడుకోవడం లేదని.. అయిన జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానిస్తాను అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టమన్నా తిట్టనని.. డబ్బులు ఇచ్చి తిట్టమన్నా తిట్టను అని.. ఆ కటుంబంపై తనకు అంత విశ్వాసం ఉందన్నారు.
ఇదీ చూడండి : చింతాత చిత చిత అనడానికి రెడీగా చింతపండు.. కారణాలు ఇవే..
అయినా లక్ష్మీ దేవిని పెళ్లి చేసుకుని ఏదో తప్పు చేశారని అంటున్నారు.. మరి ఒంటరిగా ఆయన ఉన్న సమయంలో ఆయనకు తోడుగా ఉన్నది ఎవరు అని ప్రశ్నించారు. మరి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరూ ఎందుకు అడ్డు చెప్పలేదని.. దగ్గరుండి అక్షింతలు ఎందుకు వేశారని ప్రశ్నించారు.. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు.. మరి మీకు చేసిన అన్యాయం ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడి కోసం.. ప్రచారం నిర్వహించి సాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను సైతం లోకేష్ కోసం పక్కన పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అందుకే ఇప్పుడు అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిస్తున్నారని ఆరోపించారు. తనకు నాకు జూనియర్ ఎన్టీఆర్ సీటు ఇప్పించారు. నేను ఎన్టీఆర్, హరికృష్ణకు రుణపడి ఉంటాను.. వారి కోసం ఏమైనా చేస్తాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jr ntr, Kodali Nani