K Pawan Kumar, News18, Vijayawada
విజయవాడ (Vijayawada) లో కనుకదుర్గ ఫ్లై ఓవర్ (Kanakadurga Fly Over) నిర్మాణం నేపథ్యంలో తొలగించిన తొమ్మిది ఆలయాలు రెండేళ్లు గడుస్తున్నా పునరుద్ధరణకు నోచుకోలేదు. 9 ఆలయాలను నిర్మించేందుకు రూ. 1.79కోట్లతో పనులు చేపట్టారు. అప్పటి లో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏడాది సంవత్సరంలోపు తొలగించిన తొమ్మిది ఆలయాలను నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వాటిలో శనీశ్వరుని ఆలయం, కనక దుర్గ నగర్లోని శ్రీ కృష్ణుడు ఆలయానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆలయాల నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. తొమ్మిందిటింలో ఏడు ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం వాటిని ప్రారంభించకుండా వదిలేసింది. రూ.48 లక్షలతో పూర్తి చేసిన దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, సీతమ్మ పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకేలేదు. దీంతో ఆయా ఆలయాల్లో చెత్తపేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలినవి ప్రారంభించారు అలాగే కొందరి దాతలు సహకారంతో సీతమ్మ వారి పాదాల సెంటర్ దగ్గర దాదాపు రూ.2 కోట్లతో కడుతున్న శనీశ్వరుని ఆలయం దాత సహకారంతో పూర్తి చేయాలి అని నిర్ణయించారు. అలాగే కనకదుర్గ నగర్లో దసంజనేయ స్వామి, శ్రీకృష్ణ మందిరం పనులు ఇప్పటికి కూడా ప్రారంభించలేదు. వాటి కోసం రూ.40 లక్షలు వరకు కేటాయిస్తే గోశాలకి సంబంధించిన వారు మాత్రం దుర్గగుడితో సంబంధం లేకుండా రూ.15లక్షలు తో శ్రీ కృష్ణుడు మందిరాన్ని గో పూజలకు అనుకూలంగా వుండే విధంగా నిర్మాణం చేశారు.
సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, బొడ్డు బొమ్మ ప్రారంభం ముహూర్తాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చంచి నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే శనీశ్వరుని ఆలయం దాతలు సహకారంతో నిర్మిస్తామని.., రెండు నెలల్లో భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ తెలియచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada