K Pawan Kumar, News18, Vijayawada
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతండటంతో చాలా మంది..అందుకు తగ్గట్లుగా పలు స్టార్ట్ ఆఫ్ కంపెనీలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఎలక్ట్రికల్ బైక్‌లను అందుబాటులోకి తీసుకుందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్న అవి మరి కాస్త సామాన్యుల వరకు అందడం లేదు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.
Read Also : పారిశుధ్య కార్మికులు జీతాలు వేసిన ప్రభుత్వం
కేవలం ఒకసారి చార్జీంగ్ చేస్తే దాదాపు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం ఒకసారి చార్జీంగ్ చేయడం కోసం మనకు అయ్యే పవర్ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకసారి చార్జీంగ్ చేస్తే 17 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. కేవలం ఐదు సెకన్లలోనే దాదాపు 40 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ బైక్ అందుకోగలదు. దీంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటున్నారు. రిగ్యూలర్ బైక్ లు వెళ్లే స్పీడ్ ఈ బైక్ వెళ్తుంది. 2.5 KWH లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ వచ్చే ఈ బైక్ ఫుల్ చార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఫుల్ చేస్తే కేవలం 2.5 పవర్ యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతాయని సంస్థ యాజమానులు చెబుతున్నారు.
ఐదేళ్ల వారంటీతో పాటు వచ్చే ఈ బైక్ తీసుకోవడానికి పలు బ్యాంకులు రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వాహనాలు చార్జింగ్ షాకేట్లలో ప్రధానమైన సమస్యలు ఉంటాయి. మనం నిత్యం గృహావసరాల కోసం ఉపయోగించే షాకేట్స్తో చార్జ్ చేసుకోవడం కుదరదు. కానీ ఈ బైక్‌లకు రెగ్యులర్ ఎలక్ర్టికల్ బైక్‌లకు అవసరమైన 25 యాంప్ అవసరం లేదు. సాధారణమైన గృహా అవసరాలకు ఉపయోగించుకునే షాకెట్ ద్వారానే మనం ఈ బైక్‌ను చార్జ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Local News, Vijayawada