Home /News /andhra-pradesh /

VIJAYAWADA EAT STREET IS THE BEST NIGHT FOOD COURT IN VIJAYAWADA FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada News: బెజవాడ బెస్ట్ ఫుడ్ దొరికేది అక్కడే..! అన్నీ రుచులూ ఒకేచోట..!

విజయవాడ

విజయవాడ నైట్ ఫుడ్ కోర్ట్

మీది విజయవాడే (Vijayawada) నా.., అయితే మీకు ఈ ప్లేస్‌ తప్పకుండా తెలిసే ఉండాలి.. లేదంటే ఇప్పుడు తెలుసుకోండి..! ఒక ఫ్యామిలీలో నలుగురుంటే.. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్‌..! అలా అందిరికి కావల్సినవి ఒకే చోట దొరికితే..! ఇంకేముంది హ్యాపీయేగా..!

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  మీది విజయవాడనా (Vijayawada).., అయితే మీకు ఈ ప్లేస్‌ తప్పకుండా తెలిసే ఉండాలి.. లేదంటే ఇప్పుడు తెలుసుకోండి..! ఒక ఫ్యామిలీలో నలుగురుంటే.. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్‌..! అలా అందిరికి కావల్సినవి ఒకే చోట దొరికితే..! ఇంకేముంది హ్యాపీయేగా.. సాయంత్రం అలా సరదాగా బయటకు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ కు అందరికి నచ్చే ఫుడ్‌ స్ట్రీట్‌ ఒకటి నగరంలో ఉందని మీకు తెలుసా..? అదేనండి ఈట్‌ స్ట్రీట్ రోడ్‌ .. కరోనా ఎంతోమంది జీవితాలను తలకింద్రులు చేసింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్‌ (Street Food) కోర్టుల మీద ఆధారపడే వాళ్లకు దాదాపు ఏడాదిన్నార పాటు ఆదాయం లేకుండా చేసింది. అయితే గత మూడు, నాలుగు నెలలుగా కరోనా నుంచి జనాలు బయటపడటం.. కాస్త రోడ్ల మీదకు రావడం చేస్తున్నారు. దీంతో స్ట్రీట్‌ ఫుడ్‌ కోర్టు నిర్వాహకులు కూడా తమ బిజినెస్‌ను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు.

  నైట్ లైఫ్‌ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది హైదరాబాద్‌.. కానీ విజయవాడలోనూ నైట్‌ లైఫ్ కల్చర్‌ ఇప్పుడిప్పుడే స్టార్‌ అవుతోంది. ఏ అర్థరాత్రి టైమ్‌లోనైనా రోడ్‌పై ఫుడ్‌ దొరుకుతుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో మీకు దొరకని వెరైటీ అంటూ ఉండదు. అంతేకాదు అక్కడ ఫుడ్‌ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో లభిస్తుంది.

  ఇది చదవండి: అమ్మో పసుపు కప్పలు.. గోదావరి జిల్లాలలో భయం‌. భయం..! ప్రకృతి వైపరీత్యాలకి ఇది సంకేతమా..!?


  అన్ని రకాల రుచులకు కేరాఫ్‌..!
  చికెన్ చీకులు, చికెన్ బిర్యానీ (Chicken Biryani), సీ ఫుడ్ మరియు నానవెజ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఫలుదా, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్‌తో సహా అన్ని రకాల రుచులు లభించే ఏకైక ప్రాంతం ఈ ఫుడ్ కోర్ట్ అంటున్నారు ఫుడ్ లవర్స్. వీకెండ్స్ వస్తే చాలు ఈ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలో ఉన్న ఈ ఫుడ్ కోర్టులు (Food courts) కికిరిసిపోతున్నాయంటే నమ్మండి. కేవలం వీకెండ్స్‌లోనే (Weekends) కాకుండా ప్రతి రోజు సాయంత్రం 7 గంటల తరువాత ప్రారంభమవుతుంది.

  ఇది చదవండి: చింతగింజలకు కాసులు రాలుతున్నాయ్..! ఏడాదికి కోట్లలో బిజినెస్.. మీరూ ఓ లుక్కేయండి..!


  విజయవాడ ఫుడ్ కోర్టులు మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు సవరించిన ప్రభుత్వం తమ జీవితాలకు పూర్వ వైభవాన్ని కలిగిస్తోందని చిరు వ్యాపారులు తెలిపారు. వందల సంఖ్యలో కుటుంబాలు ఫుడ్ కోర్ట్‌పై ఆధారపడి జీవిస్తున్నారని.. కోవిడ్ మహమ్మరి బారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఫుడ్ లవర్స్ (Food lovers) కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా ఆదరిస్తున్నారని, ఇవి ఇలానే కొనసాగితే తమ జీవితాలు కూడా మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఇప్పుడీ రెస్టారెంట్ అందరికీ ఫేవరెట్ స్పాట్.. ఇక్కడ స్పెషాలిటీ ఇదే..!


  కేవలం బిర్యానీలు, నాన్‌ వెజ్ ఐటమ్స్ కాకుండా వెజిరేటియన్‌ ఫుడ్‌తో పాటు చైనీస్‌, పుల్కా, రోటీ, ఇడ్లీ దోశ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. కేవలం ఫుడ్ లవర్స్ కాకుండా… సుదూర ప్రాంతాల నుంచి లేట్ నైట్ జర్నీ చేసే వాళ్లకు… ఫుడ్ కోర్ట్ ఎంతగానో తోడ్పతుంది. పొద్దంతా కష్టపడి పని చేసి సాయంత్రానికి వంట చేసుకోలేని వారికి, ఫ్రెండ్స్‌ పార్టీలకు, ఫ్యామిలీ సరదా ట్రిప్‌లకు కూడా ఈ ఫుడ్‌కోర్టు మంచి ప్లేస్‌గా మారుతుందని ఫుడ్ లవర్ చందు అన్నారు.

  ఇది చదవండి: బ్రేక్ ఫాస్ట్ లో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా..? కోడి కూయకముందే పాయా రెడీ..


  ఇట్ స్ట్రీట్ పేరుతో ఉండే ఈ రోడ్డులో దొరికే ఫుడ్ కోసం నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లను కూడా అలరిస్తోంది. మీరు ఈ సారి విజయవాడ మీదగా వెళ్తుంటే..ఒక్కసారి ఈ ఫుడ్‌ కోర్టుల్లో రుచి చూడండి.
  అడ్రస్‌: ఇందిరా గాంధీ స్టేడియం, ఎంజీ రోడ్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ - 520010

  Eat Street Vijayawada

  ఎలా వెళ్లాలి : బస్టాండ్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియం దగ్గరలోనే ఆ ఫుడ్‌కోర్టులు ఉంటాయి. ఏలూరు రోడ్డు, ఎంజీ రోడ్‌ నుంచి అక్కడకు వెళ్లొచ్చు. దాదాపు నగర వాసులంతా సొంతవాహనాల్లోనే అక్కడకు వెళ్తుంటారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు