ఏపీలో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం (Earthquake) వణికించింది. ఎన్టీఆర్ (NTR), పల్నాడు (Palnadu) జిల్లాలో భూప్రకంపనలు (Earth tremors) నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. పులిచింత ప్రాజెక్టు పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఐతే ఎంత తీవ్రతతో ఈ భూప్రకంపనలు వచ్చాయన్న వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth Tremors, Earthquake, Local News, Vijayawada