హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: శ్రీ గాయత్రీ మాతగా అమ్మవారు.. ఇవాళ దర్శించుకుంటే ఫుణ్యఫలం ఏంటో తెలుసా?

Dussehra 2022: శ్రీ గాయత్రీ మాతగా అమ్మవారు.. ఇవాళ దర్శించుకుంటే ఫుణ్యఫలం ఏంటో తెలుసా?

మూడో రోజు గాయత్రి మాత రూపంలో అమ్మవారు

మూడో రోజు గాయత్రి మాత రూపంలో అమ్మవారు

Dussehra 2022: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. ఇక మూడోరోజు అయిన ఇవాళ.. అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే దక్క ఫుణ్యఫలం ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  Dussehra:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో దసరా (Dussehra) శోభ సందడి చేస్తోంది. భక్తితో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కానకదుర్గ (Kanaka Durga) అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగాసాగుతున్నాయి. దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల (Devi Navaratri) సందర్భంగా అమ్మవారు మూడో  రోజు శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవి (Sri Gayatri Devi) గా దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కష్టాలు, ఉపద్రవాల నుండి గట్టెక్కిస్తుంది. అంతేకాదు గాయత్రీ దేవీని ఉపాసన చేయటంతో బుద్ధి తేజోవంతమవుతుంది.

  ఆశ్వయుజ శుద్ధ తదియ, బుధవారం.. అంటే మూడో రోజు శరన్నవరాత్రి మహోత్సవముల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు ఐదు ముఖాలతో శంకు చక్ర గధ అంకుసాధులు ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన వాళ్ళ బుద్ధి తేజోవంతమవుతుంది అందుకే శ్రీ భగవత్ పాదులు అది శంకరాచార్య వారు శ్రీ గాయత్రీ దేవిని అనంత శక్తీ స్వరూపంగా కొలిచేవారు. అమ్మవారి మంత్రం జపం వలన నాలుగువేదాలు చదివితే ఎంత ఫలితమొస్తుందో  అంత ఫలితం పొందవచ్చు అని పురాణాలూ చెపుతున్నాయి.

  అసలు గాయత్రి మాత అంటే న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము-అనగా తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు అని భావం. గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదం 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు.

  ఇదీ చదవండి : ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా పెద్ద వాహన సేవ.. నేడు చినవాహన సేవ.. ప్రత్యేకత ఏంటంటే..?

  'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.

  ఇదీ చదవండి : తొలి సీఎంగా జగన్ కు గుర్తింపు.. వెయ్యేళ్ల చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసా..?

  గాయత్రి మాత అంత క్షతి మంతురాలు కాబట్టి పిల్ల పెద్దలు అందరు ఈ రోజు గాయత్రీ మాతను దర్శించుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలి.ఈ రోజు అమ్మ వారికీ  కాషాయ లేదా నారింజ రంగు చీర తో అలంకరణ చేసి కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం,అల్లం గారెలు నివేదిస్తారు. ఈ రోజు గాయత్రి మాతను దర్శించుకుంటే.. ఆర్థిక సమస్యల నుంచి గట్టు ఎక్కడమే కాదు..  కోరి కోరికలు నెవరేవుతాయని భక్తులు నమ్ముతారు.. అందులోనూ బుధవారం.. తదిత తిథి కావడంతో భారీగా భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకుంటారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Navaratnalu, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు