హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

Vijayawada: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి ప్రాముఖ్యం

Vijayawada: ఇంద్రకీలాద్రి కొండపై దుర్గామల్లేశ్వర స్వామి స్వయంగా అవతరించిందని చరిత్ర చెబుతోంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యం ఈ కొండపై దుర్గామల్లేశ్వరి నామస్మరణ మార్మోగిపోతుంది. ఈ తరుణంలో ఇంద్రకీలాద్రి చరిత్ర తెలుసుకుందాం..!

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada.

  Vijayawada:  విజయవాడ అనగానే ఎవ్వరికైనా కృష్ణమ్మ పరవళ్లు ఆ ఇంద్రకీలాద్రిని నిత్యం స్పర్శించే దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. కొండపై అమ్మవారు అభయహస్తంతో చిరునవ్వు చిందిస్తూ అందరినీ ఆశీర్వదిస్తుంది. అమ్మ చల్లనిచూపు తమపై పడాలని లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు.. తమ కోర్కెలు తీర్చే కొంగుబంగారంలా కనకదుర్గమ్మను కొలుస్తుంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా అన్నీ ఆమె.. ప్రస్తుతం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవగా సాగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తుకలకు దర్శనం ఇస్తూ.. ఆశీస్సులు అందిస్తున్నారు. భక్తుల కోరే కోర్కెలు తీర్చే కొంగుబంగారమై.. అవనిపై వెలసిన అమ్మలగన్నఅమ్మ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..!

  విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కొండపై దుర్గామల్లేశ్వర స్వామి స్వయంగా అవతరించిందని చరిత్ర చెబుతోంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యం ఈ కొండపై దుర్గామల్లేశ్వరి నామస్మరణ మార్మోగిపోతుంది. ఈ తరుణంలో ఇంద్రకీలాద్రి చరిత్ర తెలుసుకుందాం..!

  పరాశక్తి యొక్క మహిమలు తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి గోరతపస్సు చేశాడట. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంది. అమితానందం పొందిన కిలుడు తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి… అమ్మ హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని కోరుకున్నాడు. అనంతరం అమ్మవారు కీలునితో నువ్వు కొండరూపంలోకి మారమని…త్వరలోనే ఈ కొండపై స్వయంభుగా ఆవిర్భవిస్తావని వరమిచ్చి అదృశ్యమైనట్లు పురాణాలు చెబుతున్నాయి.

  ఇదీ చదవండి : నిన్నమంత్రికి.. అదే రోజు అర్చకులకు అవమానం.. ఇప్పుడు భవానీలతో వివాదం.. కొండపై ఏం జరుగుతోంది?

  కీలుడు ఆనందంతో అద్రిగా మారగా, కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కొండపైకి వచ్చి దుర్గాదేవిగా అవతరించింది. నగరాన్ని పరిపాలిస్తున్న మాధవ వర్మ ధర్మ నిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి దుర్గాదేవిగా కీర్తించబడుతోంది. ఇంద్రుడు అమ్మవారి దర్శనానికి మొదటగా రావడం వల్లనే ఈ కొండ ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందిందని పురాణాలు చెబుతున్నాయి.

  ఇదీ చదవండి: కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

  అర్జునుడికి పాశుపతాస్త్రాం..!

  ద్వాపరయుగంలో అర్జునుడు వనవాసం సమయంలో శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞమేరకు శ్రీదుర్గా అమ్మవారిని కొలిచాడట. ఇక్కడ అమ్మవారి ఆజ్ఞానుసారం... పరమేశ్వరుని గురించి ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. పాశుపతాస్త్రాన్ని పొందేందుకు ఆ ఉమాపతి అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు.

  ఇదీ చదవండి : ప్రభాస్ కు మంత్రి రోజా హామీ.. రెండు ఎకరాల స్థలం కేటాయింపు..!

  అర్జునుడి బలాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మవిశాస్వాన్ని పరీక్షించాలని సతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపాన్ని ధరించి అర్జునునితో మల్లయుద్ధం చేశాడు. అతని శక్తికి, ధైర్యానికి మెచ్చి ఆ పరమశివుడు నిజరూపంతో సాక్షాత్కరించి అర్జునిడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడని పురాణగాథలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

  ఇదీ చదవండి : ఒంటరిగా ఉంటున్నారా.. మీకో గుడ్ న్యూస్.. కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

  ఏ క్షేత్రంలోనూ కనిపించని ఒక విశిష్టత ఈ క్షేత్రానికి ఉంది. కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి క్షేత్రానికి అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా ఉండి రక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం నాలుగు దిశలవైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారిని మనం చూడవచ్చు.

  ఇదీ చదవండి : కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్.. వార్నింగ్ ఎవరికి?

  శ్రీచక్రం ప్రతిష్టించిన ఆదిశంకరాచార్యులు..!

  అసురసంహారం గావించిన అనంతరం శ్రీదుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా, శాంత స్వరూపిణిగా ఉంచాలని అమ్మవారి పాదాలచెంత శ్రీచక్ర ప్రతిష్టాపనచేశారు. వైదిక పరమైన స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంగా కుంకుమతో పూజలు చేయగా, ఆనాటి నుండి అమ్మవారికి అదే విధానంలో నేటికీ నిర్విరామంగా పూజలు జరుగుతున్నాయి.

  ఇదీ చదవండి : నందమూరి బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఏంటో తెలుసా

  జమ్మిమండప నిర్మాణం..!

  12వ శతాబ్దంలో లింగధారుడైన శ్రీపతి పండితారాధ్యులు వంట చేసుకోవటానికి అక్కడ ఉన్న ప్రజలను నిప్పు అడగ్గా ఎవ్వరూ ఇవ్వలేదట. వెంటనే పండితారాధ్యులు దుర్గామల్లేశ్వరులని ప్రార్ధించి అగ్నిని పుట్టించారట. దాన్ని తమ ఉత్తరీయంలో పెట్టి (నిప్పుమూట) జమ్మిచెట్టుకు కట్టగా ఆ ఉత్తరీయం కానీ, జమ్మిచెట్టు కానీ అగ్ని వేడిమికి దహించ బడకుండా అద్వితీయంగా వెలుగుతూ ఉంది. ఈ సంఘటనకు చిహ్నంగా జమ్మిమండపం అనే నిర్మాణాన్ని ఆనాటి బెజవాడ పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.

  తరతరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రం పై ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా జరగుతాయి. వేలాదిమంది భక్తులను అమ్మవారిని దర్శించి విశేష పూజలు చేస్తారు. విజయదశమి పర్వదినమున హంసవాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జల విహారం చేసే దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Local News, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు