హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. తొలి రోజు స్వర్ణకవచాలంకృత దేవీగా దర్శనం.. దర్శించుకుంటే ఆ సమస్యలు తీరినట్టే

Dussehra 2022: వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. తొలి రోజు స్వర్ణకవచాలంకృత దేవీగా దర్శనం.. దర్శించుకుంటే ఆ సమస్యలు తీరినట్టే

తొలి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా దర్శనం

తొలి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా దర్శనం

Dussehra 2022: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మ వారు తొలి రోజు శ్రీ కనక దుర్గమ్మవారు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గా దేవి గా దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతయని భక్తుల నమ్మకం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన మన భారతదేశంలోని శక్తి క్షేత్రాలలో విజయవాడ (Vijaywada)లోని ఇంద్రకీలాద్రి క్షేత్రము చాలా విశిష్టమైనది. పావన కృష్ణానదీ (krishna River) తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి (Sri Kakadurgadevi), మల్లేశ్వర స్వామి (Malleswara Swamy)వారు స్వయంగా అవతరించటం విశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలా పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. నిత్యం వేదమంత్రాలతో, స్తోత్రాలతో భక్తులు గావించే శ్రీదుర్గామల్లేశ్వరుల దివ్యనామ స్మరణలతో ఇంద్రకీలాద్రి క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతుంది.  అందుకే అక్కడ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే జన్మజన్మల ఫుణ్యఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ మరింత ప్రత్యేకం.. తొమ్మిది రాత్రులు.. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు చేరుకుంటారు.

  ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ప్రాచీనకాలంలో పరాశక్తి మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా..  అతని భక్తికిమెచ్చి శ్రీ అమ్మవారు వరాన్ని కోరుకోమనగా పరమానంద భరితుడైన కీలుడు అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, కీర్తించి తన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడు.

  శ్రీ అమ్మవారు కీలునితో నీవు అద్రి (కొండ) రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని చెప్పగా, కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా, కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా నిలిచింది. ఈ నగరాన్ని పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి శ్రీకనకదుర్గాదేవిగా కీర్తించబడుతుంది. ఇంద్రుడు శ్రీ అమ్మవారికి దర్శనమునకు మొదటగా రావడంతో ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది.

  జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ విజయవాడ కొంగు బంగారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దేవాలయం ఇంద్రకీలాద్రి పైన వేంచేసి ఉన్న దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మ వారు మొదటి రోజు శ్రీకనకదుర్గమ్మవారు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గా దేవి గా దర్శనమిస్తున్నారు.

  ఇదీ చదవండి : నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏ రోజు ఏ వాహన సేవ.. ఈ సారి సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త

  ఇవాళ సోమవారం-పాఢ్యమి-స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఇవాళ బంగారు రంగు చీర వస్త్రంగా పెట్టారు. అలాగే నైవేద్యంగా పట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం స్వీకరిస్తారు.

  ఇదీ చదవండి : కూలీలుగా మారిన కలెక్టర్ దంపతులు.. పొలం గట్టుపైనే భోజనాలు.. పిల్లలతో సహా వ్యవసాయం

   ఇలా దర్శనం ఇవ్వడం వెనుక కూడా కథ ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి శ్రీ అమ్మవారు (దుర్గాదేవి) విజయవాటికాపురి నందు కనకవర్షం కురిపించిందని అప్పటినుండి శ్రీ అమ్మవారు కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవము లలో స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అలంకరించటం జరుగుతుంది. ఈ రోజు ఈ రూపంలో తల్లిని దర్శించుకోవడంతో.. ఎలాంటి సమస్యలైనా తొలిగిపోతాయి. భక్తులకు ఆర్థికపరమైన రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు