హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు.. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

Dussehra 2022: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు.. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

లలితా త్రిపుర సుందరి దేవీగా అమ్మవారు

లలితా త్రిపుర సుందరి దేవీగా అమ్మవారు

Dussehra 2022: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు ఐదో రోజు.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమీయనున్నారు కనకదుర్గ మాతా..? ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్య ఫలం ఉంటుందో తెలుసా?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    Dussehra 2022: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నరవరాత్రి ఉత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. ఇక మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ కనక దుర్గా దేవి  (Kanakadurga Devi) క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తూ.. భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక నేడు ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి (Lalita Tripura Sundari Devi Ga) గా దర్శనమిస్తున్నారు. కనకదుర్గ అమ్మవారని.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో కొలిస్తే సకల ఐశ్వర్యలు లభిస్తాయి. ఆశ్వయుజ శుద్ధ పంచమి, శుక్రవారం ఐదో రోజున శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గా దర్శనం ఇస్తున్నారు.

    అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్న జగన్మాత..  శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరు మందహాసంతో, వాత్సల్య రూపిణిగా చెరకుగడను చేత పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తులచేత పూజలందు కుంటున్నారు.

    ''లకార రూపా లలితా, లక్ష్మీ వాణీ నిషేవితా''గా పిలువబడే అమ్మ నవరాత్రుల్లో ఐదవ రోజు లలితా త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నెలవంకయైన కిరీటం ధరించి మనకు కనబడుతుంది. లలితా అనగా లావణ్యం అని అర్థం. త్రిపుర సుందరీ అనగా ఆనందం కలిగించేది అని అర్థం.

    ఇదీ చదవండి : శ్రీవారికి ప్రకృతి సొబగులు.. స్నపనం కోసం జపాన్ ఆపిల్స్.. మస్కట్ గ్రేప్స్.. కొరియన్ పియర్స్

    ఈ అమ్మవారు మనపై రెండు చేతులలో పాశం, అంకుశం, కింది చేతులలో చరకబిందు అలాగే ఐదు పూవుల బాణాలు ధరించి మనకు దర్శనమిస్తారు. ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి.. మన చుట్టూ ఉండే పాంచభౌతికశకే లలితా.. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తస్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకి చొచ్చుకొని ఉన్నాయి.

    ఇదీ చదవండి : సింహ వాహనంపై యోగ నరిసింహుడు.. ముత్యపు పందిరిలో కళా నీరాజనం.. స్వామి దర్శనంతో భక్తులకు తన్మయత్వం

    ఇందులో ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం.

    ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి కుంకుమ ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవీగా దర్శించుకుంటే.. ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం..

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Navaratri, Vijayawada Kanaka Durga

    ఉత్తమ కథలు