హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూల.. సరస్వతీ దేవి రూపంలో దర్శనం.. విశిష్టత ఏంటంటే?

Dussehra 2022: నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూల.. సరస్వతీ దేవి రూపంలో దర్శనం.. విశిష్టత ఏంటంటే?

సరస్వతి దేవి రూపంలో అమ్మవారి దర్శనం

సరస్వతి దేవి రూపంలో అమ్మవారి దర్శనం

Dussehra 2022: ఈ రోజు మూలా నక్షత్రం.. అమ్మవారి జన్మ నక్షత్రం.. అందుకే ఈ రోజు కనకదుర్గా దేవి.. సర్వస్వతి మాత రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు దర్శించుకుంటే పుణ్య ఫలం ఎంతో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ (Kanaka Durgamma) ఈ రోజు భక్తులకు సరస్వతి దేవి (Sarwathi Devi) రూపం లో దర్శనమీయనున్నారు. నవరాత్రులలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూల నక్షత్రం రోజైయినా ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి గా భక్తులకు దర్శనమిస్తూ  విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది. ఈ రోజు ఏడవరోజు ఆశ్వీజ సుద్ద సప్తమి మూల నక్షత్రం అనగా జగన్మాత జన్మనక్షత్రం.. అందుకే ఈరోజు ఎంతో ప్రాశస్త్యం కలిగిన రోజుగా భావిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో అర్ధరాత్రి నుండే కిటకిట లాడుతుంది.  సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే..  విద్యా బుద్ధులు  చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుంది.

  మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్ధినీ విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహంవలన సర్వ విద్యలయందు విజయం పొందుతారు.

  మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.

  ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించి వారి సేవలకు సలామ్

  రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే రావణుడు అమరత్వం అడుగుతాడు కానీ అది ప్రకృతి విరుద్ధం అని అంటే రకరకాల దేవ కిన్నెర కింపురుషాది గణాల వలన చావు రాకుండా అడుగుతాడు. బ్రహ్మ అలాగే అని వరమిచ్చాడు. ఇక కుంభకర్ణుడి వంతు. ఈ తతంగాన్ని గమనిస్తూ ఉన్న దేవతలు రావణుడి కోరికయే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడి కోరిక ఇంకెంత చిక్కు తెచ్చి పెడుతుందో అని బ్రహ్మ కుంభకర్ణుని వరం కోరుకోమనేలోపు దేవతలు అంతా సరస్వతీ దేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు.

  ఇదీ చదవండి : ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడవాహనంపై శ్రీవారు.. విశిష్టతలు ఇవే

  జ్ఞానం, తెలివి, విద్య లాంటి వాటికి అధిదేవత కాబట్టి ఆమె మనందరి బుద్ధులలో ఉంటుంది. ఆమె దయవల్లనే మనం ఆలోచించగలం. కాబట్టి కుంభకర్ణుని బుద్ధి ని కాస్త మందగించేలా చేసిన సరస్వతీ దేవి మహిమతో కుంభకర్ణుడు *నేను నిద్ర పోవాలి* అని అప్రయత్నంగానే అంటాడు. దానికి బ్రహ్మ తథాస్తని పలకడం తో నిద్ర పోవడమే ధ్యేయంగా కుంభకర్ణుడు జీవితాన్ని గడిపాడు. తిండి నిద్ర తప్ప ఇంకేమీ ఎరుగని వాడయ్యాడు. ఈ రోజు జగన్మాత కనకదుర్గా దేవి కి శ్వేతా వస్త్రాలతో  అలంకరించి దద్దోజనం ,కేసరి ,పరమాన్నం తో నివేదిస్తారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Dussehra 2022, Navaratri, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు