• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA DURGA TEMPLE CHAIRMAN SOMINAIDU CELEBRATES HIS BIRTHDAY IN TEMPLE PREMISES SU

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గ గుడిలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు.. భక్తుల ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

Vijayawada Durga Temple: విజయవాడ కనదుర్గమ్మ ఆలయంలో జన్మదిన వేడుకలను జరుపుకోవడం వివాదస్పదంగా మారింది. దుర్గ గుడి చైర్మన్ పైల సోమినాయుడు తన జన్మదిన వేడుకలను గుడిలో జరుపుకున్నారు

  • Share this:
    విజయవాడ కనదుర్గమ్మ ఆలయంలో జన్మదిన వేడుకలను జరుపుకోవడం వివాదస్పదంగా మారింది. దుర్గ గుడి చైర్మన్ పైల సోమినాయుడు తన జన్మదిన వేడుకలను గుడిలో జరుపుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలోని తన చాంబర్‌లో సోమినాయుడు కేక్ చేసి మరి పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆ కేకును పలువురికి పంచిపెట్టారు. అయితే ఆ కేకులో గుడ్డు కలిసిందని కొందరు చెబుతున్నారు. ఈ వేడుకలకు పలువురు ప్రైవేటు వ్యక్తులు కూడా హాజరయ్యారు.ఆలయ ప్రాంగంణంలో పుట్టినరోజు వేడుకలు జరపడంపై పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని భక్తులు విమర్శిస్తున్నారు.

    పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపడంపై విమర్శలు వెల్లువత్తడంతో సోమినాయుడు స్పందించారు. తాను కట్ చేసిన కేక్‌లో గుడ్డు కలవలేదని సోమినాయుడు సమాధానం ఇచ్చాడు. పుట్టినరోజు వేడుకలపై స్పందిస్తూ గుడ్డు కలవని కేక్ కట్ చేశానని చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: