Vijayawada Durga Temple: వెండి సింహాల మాయంపై విచారణకు కమిటీ వేసిన ప్రభుత్వం

తాము అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా రథాన్ని బయటకు తీయలేదని వెల్లడించారు. అసలు ఏం జరిగిందో కమిటీ విచారణలో బయట పడుతుందని స్పష్టం చేశారు వెల్లంపల్లి.

news18-telugu
Updated: September 16, 2020, 12:06 PM IST
Vijayawada Durga Temple: వెండి సింహాల మాయంపై విచారణకు కమిటీ వేసిన ప్రభుత్వం
రథంపై వెండి సింహం విగ్రహాల మాయం
  • Share this:
విజయవాడలో కనకదుర్గ వెండి సింహాల మాయంపై దుమారం కొనసాగుతోంది. అధికారుల వైఫల్యం వల్లే సింహాలు మాయమయ్యాయని బీజేపీ ఆరోపిస్తుంటే... ఈవో మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ఈ క్రమంలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయాన్ని సందర్శించి రథాని పరిశీలించారు. ఈవో సురేష్‌ని అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వెండి సింహాల మాయంపై దేవాదాయ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా రథాన్ని బయటకు తీయలేదని వెల్లడించారు. అసలు ఏం జరిగిందో కమిటీ విచారణలో బయట పడుతుందని స్పష్టం చేశారు వెల్లంపల్లి.

''రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కవర్‌ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదు. భద్రపరిస్తే ఒకే. ఒకవేళ చోరీకి గురైతే చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు పెడతాం. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది. ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం.'' అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

కాగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాలు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని తెలుస్తోంది. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైంది. కానీ ఈవో మాత్రం వెండి పూతే ఉంటుందని చెబుతున్నారు. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading