Corona Vaccination in AP: బ్లాక్ లో కొవిడ్ వ్యాక్సిన్..? అక్కడి నుంచే దారిమళ్లుతున్నాయా..?

ప్రతీకాత్మకచిత్రం

ఇన్నాళ్లు కరోనా మందుల (Corona Medicine) బ్లాక్ మార్కెటింగ్ చూశాం. ఇప్పుడు వ్యాక్సిన్ (Covid Vaccine) కూడా బ్లాక్ మార్కెట్లు తరలిపోతుందన్న అనుమానాలు వస్తున్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆక్సిజన్ బెడ్లు, మందులు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం జనం పరుగులు పెడుతున్నారు. ఇదే క్రమంలో బ్లాక్ మార్కెట్ మాఫియా కూడా విజృంభిస్తోంది. మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. ఐతే ఇన్నాళ్లూ కరోనా మందులను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్న అధికారులు.. ఇప్పుడు వ్యాక్సిన్లను కూడా దారిమళ్లిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకొని కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకుందామనుకునేవారికి టోకరా వేస్తున్న కేటుగాళ్లు వ్యాన్సిన్ వేయడంలోనూ కాసుల కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు. టీకా వేసే సమయంలో తక్కువ మోతాదులో ప్రజలకు వేసి వయల్స్ ను దాచి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పుడీదందా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విజయవాడలోని సత్యనారాయణపురం ప్రాంతంలో ప్రైవేటుగా ఓ కారులో వచ్చి వ్యాక్సిన్ వేయడం కలకలం సృష్టించింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు ఓ ఇన్నోవా కారును వెంబడించి పట్టుకున్నారు.

    కారులో ఉన్న వారు భీమవరంకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు విచారించగా.. వ్యాక్సిన్ కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో వారిని కాసేపు ప్రశ్నించి వదిలేశారు. దీనిపై సమాచారం అందుకున్న భీమవరం తహసీల్దార్ ఏవీ రమణారావు కొవిడ్ వ్యాక్సినేషన్లో తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానంతో విచారణ జరిపారు. ఈ క్రమంలో భీమవరంలో జరుగుతున కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న కేంద్రాల్లో పరిశీలించారు. ఓ వ్యాక్సిన్ సెంటర్లో వంద మందికి టీకాలు వేసినట్లు గుర్తించారు. ఐతే వంద మందికి టీకాలు వేయడానికి 10 మందికి ఒక వయల్ చొప్పున పది వయల్స్ వినియోగించాలి.. కానీ అక్కడ ఎనిమిదిన్నర వయల్స్ మాత్రమే ఉపయోగించినట్లు గుర్తించారు. మిగిలిన ఒకటిన్నర వయల్ ను ఏం చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు.

    ఇది చదవండి: ఏపీలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’... యువ ఎంపీ వినూత్న ఆలోచన


    ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ సిబ్బంది కావాలనే తక్కువ మోతాలో వ్యాక్సిన్ వేది మిగతాది బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా అన్ని ఖాళీ వయల్స్ ను తిప్పి పంపిస్తున్నారు. దారి మళ్లించిన వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఇది చదవండి: ఏపీలో వ్యాక్సినేషన్ కు సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.., ఆ విషయంలో మరింత ముందుకు..


    కొవిడ్ వ్యాక్సన్ బ్లాక్ దందా ఒక్క భీమవరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలతో జిల్లా వైద్య ఆరోగ్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు భీమవరం తసీల్ధార్ ఏవి రమణారావు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. అసలే కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్లు రాక ప్రజల అవస్థలు పడుతుంటే.. ఇలాంటి బ్లాక్ దందా వారిని మరింత ఇబ్బంది పెడుతోంది.
    Published by:Purna Chandra
    First published: