Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
TDP Strategy: ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అంటారు..? అలాగే ఇప్పుడు టీడీపీ (TDP)కి టైం వచ్చిందా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత.. వరుసగా మూడేళ్ల పాటు గెలుపు రుచి చూడడం మరిచిపోయింది టీడీపీ.. అన్ని ఎన్నికల్లోనూ పరాజయాలే.. అయితే ఆ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది అనుకుంటున్న సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) రూపంలో గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అంటున్నారు. అందుకే ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతం ఎగురవేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపి (TDP).. మొదట మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. ఇక తాజాగా గెలిచే బలం లేని చోట కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక ఉన్నది ఎవరు..? ఈ గెలుపును ముందే ఊహించిన మాస్టర్ మైండ్ ఎవరిది అంటూ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇటీవల ఎన్నికలంటే పార్టీలు వర్సెస్ పార్టీలులా కనిపించడం లేదు. పొలిటికల్ కన్సల్టెన్సీలు వర్సెస్ పొలిటికల్ కన్సల్టెన్సీలులా నడుస్తోంది. గత పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో అవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీలతో నడుస్తున్నాయి. వారు ఏది చెబితే.. అదే ఫైనల్. అక్కడ మీకు ఓటింగ్ 50-50 ఛాన్స్ అని చెబితే.. అక్కడ వాలిపోయి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేవలం రాజీకయ పార్టీలే కాదు.. పొలిటికల్ కన్సల్టెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మేఘాలయలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) నియమించిన పొలిటికల్ కన్సల్టెన్సీ షోటైమ్ అక్కడ పార్టీని గెలిపించింది. ఇదే కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయ ప్రచార వ్యూహాన్ని కూడా చేస్తోంది.
మేఘాలయ రాజకీయ యుద్ధంలో షోటైమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఐ ప్యాక్ ఓవైపు పని చేస్తే.. షోటైమ్ మరోవైపు పని చేస్తోంది. ఐప్యాక్ సృష్టికర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసిన రాబిన్ శర్మ షో టైమ్ పేరుతో కొత్త దుకాణం పెట్టారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు రాజకీయ కన్సల్టెన్సీలు తలపడనున్నాయి. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని NPP 60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీలో 26 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. షోటైమ్ పనితనానికి ఇది నిదర్శనం.
ఈ కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కోసం రాజకీయ వ్యూహాన్ని చేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆంధ్రాకి సరైన వ్యూహాలు చేస్తే.. గెలుపు సాధ్యమేనని షో టైమ్ అభిప్రాయపడుతోంది. మైక్రో స్ట్రాటజీకి తగిన ప్రాముఖ్యతను ఇస్తోంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైెఎస్ఆర్ సీపీ (YSRCP) - ఐప్యాక్ ( IPAC) టీంతో తో షో టైమ్ తలపడనుంది.
ఇదీ చదవండి : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ.. నేటి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా.. ఆయన బెంగళూర్ వెళ్లారా..?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన IPAC అనేది రాజకీయ వర్గాల్లో స్థిరపడిన పేరు. అనేక మంది ప్రధాన నాయకులు, రాజకీయ పార్టీలను ఎన్నికల విజయాల కోసం ఐప్యాక్ కృషి చేసింది. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వంటి ప్రముఖులు రాజకీయ నేతలు ఈ ఐప్యాక్ ను వినియోగించుకున్నారు. షోటైమ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ గతంలో IPACలో పని చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu