VIJAYAWADA DHONI FANS CELEBRATING HIS BIRTHDAY WITH 41FEET CUT OUT IN VIJAYAWADA DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
MS Dhoni Birthday: బెజవాడ అంటే ఆ మాత్రం ఉండాలి.. ధోనీ బర్త్ డేకి భారీ కటౌట్.. ఫ్యాన్స్ రచ్చరచ్చ..
ఎన్టీఆర్ జిల్లాలో ధోనీ భారీ కటౌట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ధోనీ గ్రౌండ్ లోకి దిగితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అదే ధోనీ బర్త్ డే (Dhoni Birthday) వస్తే వాళ్లు చేసే రచ్చే వేరు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ధోనీ గ్రౌండ్ లోకి దిగితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అదే ధోనీ బర్త్ డే (Dhoni Birthday) వస్తే వాళ్లు చేసే రచ్చే వేరు. తమ పుట్టిన రోజుల కంటే ఘనంగా మహీకి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. జూలై 7 గురువారం ధోనీ బర్త్ డే కావడంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ 41వ జన్మదినం సందర్భంగా 41 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. అది కూడా వన్డే వరల్డ్ కప్ లో విన్నింగ్ షాట్ కొడుతున్న స్టిల్ తో కటౌట్ రూపొందించారు. 41అడుగుల కటౌట్ తో పాటు 41 కేజీల కేక్ కట్ చేసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయినా అభిమానం మాత్రం కొంచెం కూడా తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం. ఇక విజయవాడ అంటేనే ఏ వేడుకకైనా ఫ్లెక్సీలు కట్టేస్తారు. మహీకి ఏకంగా కటౌట్ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు అంబారుపేట యువకులు. ధోనీ కటౌట్ ను నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేయడంతో వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ,భారత్, సాయి, సిద్దు,బెనాకర్ సహా మరికొందరు అభిమానులు కలిసి ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్టర్ కూల్ బర్త్ డే అంటే ఆమాత్రం ఉండాల్సిందేనని అభిమానులంటున్నారు. కటౌట్ ఫోటోలను ట్విట్టర్ లో కూడా వైరల్ చేస్తున్నారు. మరి ఈ కటౌట్ మేటర్ ధోనీ వరకు చేరితుందా.. ఫ్యాన్స్ చేసిన పనికి మహీ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే గురువారం మిస్టర్ కూల్ ధోనీ 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. ఆ తర్వాత మళ్లీ సారథ్యాన్ని చేపట్టాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చలేకపోయాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ గా నిలిచిన ధోనీ.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ తో పాటు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్ గా నిలిపాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ధోనీ.. వ్యవసాయం, వ్యాపారాలు, యాడ్స్ చేస్తున్నాడు. సినిమాలు నిర్మించే ఆలోచనలోనూ ఉన్నాడు మహీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.