Home /News /andhra-pradesh /

VIJAYAWADA DEATH TOLL RAISED IN WEST GODAVARI DISTRICT AS OFFICIALS ENQUIRING ABOUT CAUSES FULL DETAILS HERE PRN

Mystery Deaths: ఏపీలో కొనసాగుతున్న మిస్టరీ మరణాలు.. వణికిపోతున్న జనం.. రంగంలోకి దిగిన అధికారులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు కొనసాగుతున్నాయి.. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 18 మంది హఠాత్తుగా చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలు కొనసాగుతున్నాయి.. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 18 మంది హఠాత్తుగా చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనెల 9, 10వ తేదీల్లో అంటే రెండు రోజుల్లో 15 మంది మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు 15 మంది 40- నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్నవారే ఉన్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నవారు అకస్మాత్తుగా అస్వస్థతకు గరికావడం అసలు ఏం జరిగిందో డాక్టర్లు గుర్తించేలోపు ప్రాణాలు కోల్పోతున్నారు. ఐతే ఈ మరణాలన్నింటికీ నాటుసారానే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

  జంగారెడ్డి గూడెంలో శుక్రవారం ఒకరు మృతి చెందగా.. శనివారం మరో ఇద్దరు వింత లక్షణాలతో ప్రాణాలు విడిచారు. శనివారం తెల్లవారుజామున అనిల్ అనే వ్యక్తి, మధ్యాహ్నం ఒడిశా నుంచి వచ్చిన కూలీ ఉపేంద్ర ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ వ్యక్తి శరీరంలో అవయవాలేవీ పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు.

  ఇది చదవండి: వివేకా హంతకులెవరో పులివెందులలో అందరికీ తెలుసు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..


  వరుస మరణాల నేపత్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అసలేం జరిగింది. మృతుల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలున్నాయి. వారి అలవాట్లు, చనిపోయే ముందు తీసుకున్న ఆహారం, వారి మద్యం, సారా తాగే అలవాటు ఉందా అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: పాపం పసివాడు.. తల్లి నిద్రపోతుందనుకున్నాడు.. కానీ నాలుగు రోజుల తర్వాత


  మృతులంతా కూలిపనులు, చిన్నచిన్న వృత్తులు చేసుకునేవారే. అస్వస్థతకు గురిన వెంటనే ఆర్ఎంపీలు, స్థానిక డాక్టర్ల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం.. పెద్దాస్పత్రులకు వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఎక్కువ మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ మిస్టరీ మరణాల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. ఐతే కల్తీసారా వీరంతా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుల్లో చాలా మంది రోజువారి కూలి పనులు చేసుకునేవారు కావడంతో సారా తాగి అస్వస్థతకు గురై ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిరై డాక్టర్లుగానీ, అధికారులు గానీ స్పందించలేదు.

  ఇది చదవండి: ఆ ప్రాంతంలో మాయమవుతున్న గేదెలు.. తలపట్టుకుంటున్న రైతలు, పోలీసులు..


  మరోవైపు ఈ మిస్టరీ మరణాలకు నాటుసారానే కారణమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యేలనని ఆ పారటీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మద్యపాన నిషేధం అంటూనే నాటుసారా మాఫియాను ప్రోత్సహిస్తున్నారని.. ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: సుబ్బయ్య హోటల్ పై ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. అక్కడ నో పూరీ.. నో బోండా.. నో బజ్జీ..!


  ఇదిలా ఉంటే 2020 డిసెంబర్లో ఏలూరులో వ్యాపించిన వింత వ్యాధితో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వందలాది మంది వాంతులు, ఇతర లక్షణాలతో ఆస్పత్రుల పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఆ ఘటనకు కూరగాయలు, ఆహారపదార్థాలపై ఉన్న పురుగుమందుల అవశేషాలేనని నిపుణులు తేల్చారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, West Godavari

  తదుపరి వార్తలు