NTR District, Yashwanth, News18
పెనుగంచి ప్రోలులో జరుగుతున్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయ సమీపంలోని కళ్యాణ వేదికను డీసీపీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మేరీ ప్రశాంతి మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. అదే విధంగా గత వారం రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆలయ ఆవరణలో ఉన్న దుకాణాల వద్ద అగ్నిమాపక యంత్రాలతో పాటు నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు.
మున్నేరులో ఉన్న షాపులపై ఉన్నటువంటి తాటాకులను తీసి రేకులను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదికకు దగ్గరలో ఫైర్ ఇంజన్ ను ఏర్పాటులు చేస్తున్నట్టు తెలియజేశారు. షాపులకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కు సంబంధించిన వైర్లను లూజ్ కనెక్షన్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మున్నేరు అవతల అమ్మవారి మామిడి తోటల సమీపంలో 5వ తేదీన జరగనున్న అన్నదాన కార్యక్రమం ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎసిపి నాగేశ్వర్ రెడ్డి, వారి సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ పాల్గొన్నారు.
తిరునాళ్లు జరుగు సమయంలో ఎటువంటి అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిసిపి మేరీ ప్రశాంతి అధికారులకు సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఈనెల 5వ తారీఖు జరుగు కళ్యాణ మహోత్సవం, పెద్ద తిరునాళ్ల ఏర్పాట్లను ఆమె నందిగామ ఎసిపి నాగేశ్వర్రెడ్డి ఆలయ కార్యనిర్వనాధికారి లీలాకుమార్ ఆలయ ఈ ఈ వైకుంఠరావు చైర్మన్ చెన్నకేశవులు పరిశీలన చేశారు.
తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. కళ్యాణమ రోజు సుమారు 350 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయం వద్ద పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకునే దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన.. జాగ్రత్తలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలన్నారు.
దుకాణాలు వద్ద విధిగా మంటలు చెల్లరేగినప్పుడు మంటలను ' అదుపు చేసేందుకు ప్రతి దుకాణం వద్ద డ్రమ్ముల్లో నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే మునేటి అవతల ఉన్న అమ్మవారి ఆడిటోరియం వద్ద అమ్మవారి దీక్ష తీసుకున్న స్వాములు భక్తులు భోజనాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కళ్యాణం జరుగు ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు సమయంలో కళ్యాణం చూచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అంచనా మేరకు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూ లైన్లు గ్యాలరీలు ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సీఐ నాగ మురళి స్థానిక ఎస్సై హరిప్రసాద్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, NTR