K Pawan Kumar, News18, Vijayawada
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ (Mobile Phone) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మెుబైల్ లేనిదే ఏ పని అవ్వడం లేదు. కొత్తగా ఏ పరిజ్ఞానం వస్తున్న అందరికిఉత్సహం పెరిగిపోతుంది. అలా కొత్తగా వస్తున్న పరిజ్ఞానంపై ఉన్న ఆతృతని మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. మీరు 5జీసేవలను పొందాలి అంటే మీకు వచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి అంటూ అలా లింక్ ఓపెన్ చేస్తే మీ 4జీ కాస్త 5జీ సేవలను పొందవచ్చని నమ్మిస్తారు. అలా లింక్ క్లిక్ చేయగానే మోసగాళ్లకు వ్యక్తి గత సమాచారంతో పాటు వారి వారి యూజర్ ఐడి, పాస్ వర్డ్, మోసగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఇక ఆతర్వాత మీ బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ అవుతుంది.
ఈ మధ్య కాలంలో విస్తరిస్తున్న 5జీనెట్ వర్క్ పేరుతో కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. వేగవంతమైన నెట్ వర్క్ వాడాలని ఆతృతని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రకరకాల పద్ధతుల్లో అమాయకుల దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నారు.. ఇలాంటి వాటిపై అవగాహన లేని అమాయక ప్రజలు మోసపోతున్నారు. విజయవాడలో గత రెండు నెలలుగా ఈ 5 జి మోసాలు జరుగుతున్నాయి.
విజయవాడ నగరంలో పటమట ప్రాంతానికి చెందిన ఒక యువకుడుకి టెలికాల్ కంపెనీ నుంచి అంటూ ఫోన్ వచ్చింది. విజయవాడలో కొత్తగా 5జీసేవలు మొదలయ్యాయని మీ పరిధిలోని వారికి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కాకపోతే మొబైల్ లో సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేయాలి అని 1జీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుందని నమ్మించారు.
అది నిజమే అని నమ్మిన యువకుడు తన మొబైల్ కి వచ్చిన లింక్ ను ఓపెన్ చేసి అందులో వివరాలను ఎంటర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తికి ఓటీపీ కూడా చెప్పాడు. అంతే ఆ నిముషాల వ్యవధిలో అతడి బ్యాంక్ ఎకౌంట్ నుంచి దాదాపు రెండు లక్షలు మాయమయ్యాయి. వెంటనే తనకు మెసేజ్ పంపిన నెంబర్ కు కాల్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ ఫోన్ నెట్ వర్క్ సర్వీసులు, ఇతర ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను జనం నమ్మవద్దని.. ఓటీపీల వంటివి అస్సలు చెప్పొద్దని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CYBER CRIME, Local News, Vijayawada