హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: నాటు కోడి కావాలా..? అయితే మీకిదే బెస్ట్ ప్లేస్.. రేటు కూడా తక్కువే..!

Vijayawada: నాటు కోడి కావాలా..? అయితే మీకిదే బెస్ట్ ప్లేస్.. రేటు కూడా తక్కువే..!

X
విజయవాడలో

విజయవాడలో నాటుకోళ్ల మార్కెట్

Vijayawada: నాటు కోడి మాంసం తినాలనుకునేవారు, అలాగే పందేలకు పుంజులు పెంచాలనుకునేవారితో ఈ సండే సంత నిండిపోతుంది. ఈ సంతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్లు పెంచేవారు తరలివస్తుంటారు

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

నాటు కోళ్లు (Country Chicken) అంటే ఒకప్పుడు పల్లెటూరి వాళ్ళు మాత్రమే పెంచడానికి ఆసక్తి చూపేవారు. పందేలు వేయడానికి శ్రద్ద చూపించే వాళ్ళు.అది ఎక్కువగా సంక్రాంతి పండుగ సమయాల్లో... కోడి పందేలకు కోసమని పెంచేవారు. కానీ ఇప్పుడు కోళ్లు పెంపకం అనేది ప్రతి ఒక్కరికి ఒక అలవాటుగా మారింది. పల్లెటూరులో కంటే సిటీలోనే ఎక్కువగా కోళ్లు పెంచడానికి మక్కువ చూపుతున్నారు. ఇంట్లో కుక్క, పిల్లిని ఎలా పెంచుతారో కోళ్లను కూడా అలా పెంచడానికి అందరూ మక్కువ చూపుతున్నారు, కొందరు ఫార్మ్స్ గా పెట్టుకుని నడిపే వాళ్ళు ఉన్నారు. అలాగే కొందరు ఇంటి దగ్గర పందేలుకు పెంచే వారు ఉన్నారు. ఐతే విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదివిన యువతే ఎక్కువగా కోళ్ల పెంపకంలో ఉంటున్నారు.

నాటు కోళ్లు అంటేవాటి తిండి, ఆరోగ్యం చూసుకోడం ఇలా చాలా శ్రమతో కూడుకుని ఉంటాయి. అయినా కానీ వీటిల్లోనే లాభాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఈ నాటు కోళ్లతో చాలా రకాలుగా వ్యాపారం చేస్తారు..ఇప్పుడు ఉన్న రోజుల్లో ధరల కంటే కూడా ఎక్కువగా కరోన దయవలన అందరూ ఆరోగ్యంపై శ్రద్ద చూపుతున్నారు. అయితే ధర ఎక్కువగా ఉన్నా చాలా మంది నాటుకోళ్లు తినడానికి ఇష్టపడుతున్నారు. నాటుకోడి తినడంలోనే ఎక్కువ లాభాలు, ఆరోగ్యం ఉందంటన్నారు జనం.

ఇది చదవండి: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

ప్రస్తుతం నాటుకోళ్ల వ్యాపారం లాభసాటిగానే కనిపిస్తోంది. పెట్టుబడితో పాటు లాభాలు కూడా అధికంగా ఉంటున్నాయి. అందుకే నాటకోళ్లకు ప్రత్యేకంగా సంత జరుగుతోంది. విజయవాడ సమీపంలోని యనమలకుదురులో ప్రతి ఆదివారం సంతని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంతలో కోడి గుడ్డు నుంచి . దాంట్లో నాటు కోళ్లు ,పుంజులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. రూ.1500 నుండి 20,000 వరకు సంతలో కోళ్లు లభిస్తాయి.

ఇది చదవండి: ఈ బిర్యానీకి 40ఏళ్ల హిస్టరీ.. రూ.5తో మొదలై ఇప్పుడు ఇలా..!

నాటు కోడి మాంసం తినాలనుకునేవారు, అలాగే పందేలకు పుంజులు పెంచాలనుకునేవారితో ఈ సండే సంత నిండిపోతుంది. ఈ సంతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్లు పెంచేవారు తరలివస్తుంటారు. ఒక్కరోజులోనే లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. మరో నెలన్నరలో సంక్రాంతి వస్తుంది. దీంతో ఇప్పటి నుంచి ఈ నాటుకోళ్ల సంతకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు