• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA CORONA EFFECT ON TEMPLES IN ANDHRA PRADESH RECENTLY 43 MEMBERS TESTED POSITIVE IN VIJAYAWADA KANAKA DURGA TEMPLE NGS GNT

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం. 43 మందికి పాజిటివ్ నిర్ధారణ

విజయవాడ దుర్గగుడి (ఫైల్)

ఏపీలో ఏ ఆలయాన్ని కరోనా వదలడం లేదు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. దర్శనాలను తగ్గిస్తున్నా.. కరోనా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇంద్రకీలాద్రిని భయపెట్టింది. ఒకేరోజు 43 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

  • Share this:
    దేవాలయాలను కరోనా కాటేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. దాదాపు అన్ని దేవలయాల్లోనూ కఠిన ఆంక్షలు అమలువుతున్నాయి. భక్తుల సంఖ్యను పరిమితం చేశారు. దర్శనాలను చాలా వరకు తగ్గించారు. శానిటైజేషన్ చేయడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేస్తున్నా వైరస్ ముప్ప తప్పడం లేదు. తాజాగా ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపింది.

    బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దుర్గగుడి అర్చకుల్లో ఐదుగురు కరోనా బారిన పడగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారితో పాటు మరో 20 మంది బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది హోమ్‌ ఐసోలేషన్‌కు పంపారు.

    బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కరోనా వచ్చిందని తెలియడంతో భక్తులు అటు వెళ్లాలి అంటేనే భయపడుతున్నారు. భక్తులు లేకపోవడంతో క్యూ లైన్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్క బెజవాడ అనే కాదు.. దాదాపు ఏపీలో ఉన్న అన్ని ఆలాయాలపైనా కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. మొన్ప శ్రీరామా నవమి సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణం ఏకంతంగా జరిపించాల్సి వచ్చింది. ఇప్పటికే ప్రముఖ ఆలయాన్ని భక్తుల అనుమతించే విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా కేసులు రెట్టింపు అవుతున్నాయి.. తగ్గడం లేదు.

    కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని పలు ఆలయాలపై ఈ ఎఫెక్ట్ పడింది. ఇటు తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా వెంటాడుతోంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం చిత్తూరులోనే అత్యధిక కేసులు నమోదవుతుండగా.. అందులో తిరుపతిలోనే సగానికిపైగా కేసులు వస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కేసులు పెరుగుతుండడంతో దర్శనాల సంఖ్య తగ్గించింది టీటీడీ. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసిన అధికారులు.. భక్తుల సంఖ్యను కూడా తగ్గించింది. మే 1 నుంచి 15 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 300 రూపాయల దర్శన టోకెన్లు 15వేలు మాత్రమే టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు.

    తాజాగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. నేటి నుంచి అరసవెల్లి ఆలయంలో భక్తుల దర్శనాలు రద్దు చేశారు అధికారులు. దీంతో మే 10వ తేదీ వరకు నిత్య కైంకర్యాలు ఏకాంతంగా జరగనున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: