Home /News /andhra-pradesh /

VIJAYAWADA CORONA EFFECT CINEMA THEATERS SHUTDOWN TOMORROW ONWARD IN ANDHRA PRADESH NGS TPT

Andhra Pradesh: సినిమాలపై కరోనా కాటు. ఏపీలో రేపటి నుంచి మూతపడనున్న థియేటర్స్

ఏపీలో రేపటి నుంచి థియేటర్స్ బంద్

ఏపీలో రేపటి నుంచి థియేటర్స్ బంద్

ఏపీలో మళ్లీ థియేటర్స్ మూతపడుతున్నాయి. ఓ వైపు కరోనా పంజా, మరోవైపు సినిమా రేట్లు పెంచుకునే అవకాశం లేదు. దీంతో పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి. కరోనా భయంతో కొత్తగా సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా లేవు. ఇలాంటి సమయంలో థియేటర్స్ నడిపి చేతులు కాల్చుకోవడం కంటే మూసేయడమే మేలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
    కరోనా కాటుతో సినిమా రంగం గజ గజా వణుకుతోంది. ఇప్పటికే గతంలో లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఆ నష్టాల నుంచి తేరుకుంటుంది అనుకునేలోపే మరోసారి వైరస్ పంజా విసురుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం కరోనా కారణంగా వసూళ్ల వేటలో పూర్తిగా వెనుకబడ్డాయి. ముఖ్యంగా పవన్ సినిమా వకిలీ సాబ్ కు రిలీజ్ డేట్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అన్నారు అంతా. కానీ కలెక్షన్ల పరంగా ఐదో రోజు నుంచే వకీల్ సాబ్ చేతులెత్తేశాడు. అందుకు కారణం కరోనా ఎఫెక్ట్, మరోవైపు ఏపీలో సినిమా రేట్లను పెంచుకునే అవకాశం ఇవ్వకపోవడం కూడా..

    ఓ వైపు వేగంగా విస్తరిస్తున్న కరోనా, మరోవైపు సినిమా రిలీజ్ చేసినా టికెట్లు పెంచుకునే అవకాశం లేదు. దీంతో ఇలాంటి టైంలో సినిమాలు రిలీజ్ చేయడం కష్టమే అంటూ చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. దానికి తోడు సినిమా పరిశ్రమలో స్టార్స్ నుంచి, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ లో చాలామంది కరోనా బారిన పడ్డారు. ఇలాంటి సమయంలో షూటింగ్ లు అంటే కష్టమే.. చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ప్యూ కూడా అమలవుతోంది. దీంతో సినిమా షూటింగ్ లు సైతం వాయిదా పడ్డాయి. ఇలా రిలీజ్ చేసేందుకు సిమాలు లేవు. మరోవైపు కరోనా కారణంగా ఎక్కడిక్కడ కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. మరోవైపు ఏపీలో సైతం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికీ తోడు కరోనా భయంతో ప్రజలు సైతం సిినిమా హాళ్లవైపు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా హాళ్లు నడిపించి చేతులు కాల్చుకోవడం కంటే మూసేయడమే బెటరని నిర్ణయానికి వచ్చారు.

    మొదట చిత్తూరు జిల్లా వ్యాప్తంగా థియేటర్లు మూసేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోవడంతో పాటు కొత్త సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా లేవు. అందుకే రేపటి నుంచి సినిమా హాళ్లను మూసేయడమే బెటరని నిర్ణయానికి వచ్చారు. రేపు చాలా వరకు థియేటర్లను మూసేస్తున్నారు. ఎల్లుండి నుంచి మరికొన్ని థియేటర్లు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమా హాళ్లను మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నిజంగా ఇది సినిమా రంగంపై ఆదారపడి బతుకుతున్న వారికి నరకయాతనే అనని చెప్పాలి.  సినిమాలను నమ్ముకుని ఏపీ వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. వారందరు ఇప్పుడు మరోసారి ఉపాది కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరణ చూస్తే ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. దీంతో వారంతా బతకడం ఎలా అని మదన పడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chittoor, Cinema, Corona, Corona cases, Corona positive, Tirupati, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు