హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: మీకు హిందీ రాయడం, మాట్లాడటం వచ్చా..! ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే..!

Vijayawada: మీకు హిందీ రాయడం, మాట్లాడటం వచ్చా..! ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిందీ (Hindh).. మన జాతీయ భాష (National Language).. మన దేశంలో అత్యధికులు మాట్లాడే రాజ భాష. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌ (English), చైనీస్‌ లాంగ్వేజ్‌ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన లాంగ్వేజ్‌ హిందీ అనడంలో అతిశయోక్తి లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

హిందీ (Hindi).. మన జాతీయ భాష (National Language).. మన దేశంలో అత్యధికులు మాట్లాడే రాజ భాష. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌ (English), చైనీస్‌ లాంగ్వేజ్‌ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన లాంగ్వేజ్‌ హిందీ అనడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌ 14న హిందీ భాషా దినోత్సవం (హిందీ దివాస్‌)ను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది హిందీ భాష దినోత్సవం పురస్కరించుకుని పోటీపరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రేమ్‌ధల్‌ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ తెలిపారు. హిందీ భాషపై వ్యాస, కవిత్వ, రచనలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ పోటీలో పాల్గొని సత్తా చాటొచ్చు. తమ ప్రతిభతో బహుమతులు గెలవొచ్చు. భారతదేశం అన్ని రకాల మతాలు, భాషల కలియిక. అయితే ప్రాంతీయ భాషలు అనేకం ఉన్నపటికీ హిందీ భాష దేశంలో అందులోనూ ఉత్తరాదిలో అత్యధికంగా వాడుకలో ఉన్న విషయం విదితమే.

అందుకనే మన జాతీయ భాష అయినహిందీ భాష చాలా రాష్ట్రాల్లో అధికారిక భాషగా అమలవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 1949 సెప్టెంబర్‌ 14న హిందీ భాషాను జాతీయభాషగా గుర్తించింది. ఈ నెల 14వ తేదీన హిందీ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ హిందీ ప్రేమ్‌ధల్ అధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు పోటీపరీక్షలు నిర్వహించనున్నారు. హిందీ భాష పై పట్టు ఉన్న విద్యార్థినీ, విద్యార్థులెవ్వరైనా ఈ పోటీకి అర్హులే. పలు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. వాటిల్లో చిత్ర లేఖనం, కవిత పఠనం, వకృత్త్వం, కథల కేటగిరిలో జూనియర్, సీనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రేమదల్ వ్యవస్థాపకుడు కే లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇది చదవండి: అగ్నిప్రమాదాలను అరికట్టే సెన్సార్‌ ఆవిష్కరణ..! ప్రయోగాలతో సత్తా చాటుతోన్న విద్యార్థులు.!


హిందీ రాజ బాషా కావడంతో హిందీ ప్రాముఖ్యత విద్యార్థుల తెలిపేందుకే గత మూడు ఏళ్లుగా సెప్టెంబర్‌ 17న ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అంతేకాదు అటు విద్యార్థుల నుంచి కూడా ఈ పోటీలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ ఏడాది కూడా పోటీలో పాల్గొనాలని అనుకున్న విద్యార్థులు ఈ నెల పదో తేదీ లోపు ఈ క్రింద ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించగలరు. ఫోన్‌ నెంబర్‌: 8328331831

భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందనేది పలువురు రాజకీయ నేతల వాదన. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాలని ప్రయత్నాలు జరిగినప్పటకీ దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటూ పోరాటం చేస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు