Home /News /andhra-pradesh /

VIJAYAWADA COCO FRESH IS A TRENDSETTER IN VIJAYAWADA VPR NJ ABH

Vijayawada: కొబ్బరినీళ్లతో ఇన్ని రకాల వెరెటీలా..! నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్ అంటున్న ఫుడ్‌లవర్స్‌!

ట్రెండ్

ట్రెండ్ సెట్ చేస్తున్న కోకో ఫ్రెష్

కొబ్బరి బొండం అంటే మనకు తెలిసి అందులో నీళ్లు తాగుతాం. కుదిరితే అందులో లేత కొబ్బరి తింటుంటాం.. ఇంతే కదా.. అనుకుంటే పొరపాటే..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరినీళ్లతో రకరకాల బిజినెస్‌లు పుట్టుకొస్తున్నాయి. మన విజయవాడలోనూ ఈ తరహా ట్రెండ్‌ మొదలయ్యింది.

ఇంకా చదవండి ...
  (Prayaga Raghavendra Kiran, News 18, Vijayawada)

  కొబ్బరి బొండం… మన దక్షిణభారతంలో ఏ ఫంక్షన్‌ అయినా, ఏ శుభకార్యాలకైనా తొలి ప్రాధాన్యత దానికే ఉంటుంది. అంతేకాదు కొబ్బరి లేని వంటకాలు కూడా చాలా తక్కువ. సమ్మర్‌ వస్తే కొబ్బరిబొండం తాగని వాళ్లు ఉండరు. అందులో ఉండే పోషక విలువల సంగతి అయితే లెక్కలేనన్ని.

  కొబ్బరి బొండం అంటే మనకు తెలిసి అందులో నీళ్లు తాగుతాం. కుదిరితే అందులో లేత కొబ్బరి తింటుంటాం.. ఇంతే కదా, అనుకుంటే పొరపాటే..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరినీళ్లతో రకరకాల బిజినెస్‌లు పుట్టుకొస్తున్నాయి. కొందరు కోక్‌ల తరహాలో కొబ్బరినీళ్లను ప్యాక్‌ చేసి అమ్ముతుంటే, మరికొందరు వాటితో జెల్లీలు తయారుచేసి అమ్ముతున్నారు. మరికొందరు లేత కొబ్బరిని కోకోనట్ వాటర్‌లో కలిపి సరికొత్త పేర్లు పెట్టి అమ్ముతున్నారు. దీనివల్ల కొబ్బరి బొండాలు ఎక్కువగా దొరకని ప్రాంతాల్లో, కాలాల్లో కూడా ఏడాది పొడవునా కొబ్బరనీళ్లు తాగొచ్చు. అందులోని పోషక విలువలు శరీరానికి అందించొచ్చు.

  సరిగ్గా ఇలాంటి ఐడియాతోనే మన విజయవాడలో ఓ హోటల్‌ ఓనర్‌… కోకోనట్‌ వాటర్‌తో సరికొత్త రెసీపీని తీసుకొచ్చారు. సహజ సిద్దంగా లభించే కొబ్బరి నీళ్లతో తయారుచేసిన ఈ కొత్త రెసిపీ ఏంటి తెలియాలంటే ఎస్కేప్ (Escape)కు వెళ్లాల్సిందే.

  రెసిపీ అంటే… అలాంటి ఇలాంటి రెసిపీ కాదండోయ్‌.. సహజ సిద్ధంగా దొరికే కొబ్బరి నీళ్లతో ఈ ఓ కొత్త రెసిపీ ఫుడ్ లవర్స్‌కు పరిచయం చేశాడు నగరానికి చెందిన శ్రీకాంత్. ఇంతకీ ఈ హోటల్‌లో అంత ప్రత్యేకంగా ఉన్న ఐటమ్ తెలియాలంటే కచ్చితంగా ముందు ఎస్కేప్ అవ్వాల్సిందే. ఎస్కేప్ అంటే మాయం అవడం అనుకుంటున్నారు కదా… అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.

  విజయవాడ గురునానక్ కాలనీ ప్రధాన మార్గంలో ప్రారంభించిన హోటల్‌ పేరే ఎస్కేప్. ఇప్పుడు నగర వాసులకే కాక సుదూర ప్రాంతవాసులకు కూడా ప్రత్యేకంగా నిలిచింది. సహజ సిద్ధమైన కొబ్బరి నీళ్ళు , లేత కొబ్బరితో తయారు చేస్తున్న కోకో ఫ్రెష్… ఈ హోటల్‌లో దొరికే స్పెషల్‌ ఐటమ్‌.

  కొబ్బరి నీళ్లతో పోషక విలువలెన్నో..!

  కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి కూడా ఆరోగ్య పరంగా మేలు చేసే గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. కొబ్బరినీళ్లలో సూక్ష్మజీవులేవీ ఉండవు..అందుకే వీటిని సహజ స్టెరిలైజ్‌డ్‌ మినరల్‌ వాటర్‌గా పిలుస్తారు. కొబ్బరినీళ్ల వల్ల ఒంట్లో ఉన్న వేడిమటుమాయం అవుతుంది. రక్తంలో ఈజీగా కలిసిపోతుంది. జీర్ణవ్యవస్థకి మేలు చేస్తాయి. అటు లేత కొబ్బరిలో.. పిండి పదార్థాలు, ఫాస్పరస్‌, ఖనిజాలు, ఎ, బి, సి-విటమిన్‌లు ఎక్కువ. అలాంటిది ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి ఎంతో ఉత్తేజం వస్తుంది.

  కోకోప్రెష్‌..!
  లేత కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్‌ చేస్తారు.. వాటిని కొబ్బరి నీళ్లలో కలిపి ఒక బాక్స్‌లో ప్యాక్‌ చేస్తారు..అలా ప్యాక్‌ చేసిన బాక్స్‌ను ప్రీజర్‌లో స్టోర్‌ చేస్తారు. కస్టమర్లకు సర్వ్‌ చేసేటప్పుడు కూల్‌ కూల్‌గా ఉంటుంది.

  వారెవ్వా..ఏం టేస్టు..!

  ఎస్కేప్ లో కోకో ఫ్రెష్ టెస్ట్ చేసిన వారంతా…వారెవా ఏముంది? అంటూ లొట్టలేసుకుంటున్నారు. అంతేకాదు కోకో ఫ్రెష్ చాలా టేస్టీగా ఉందంటూ తమ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ను అక్కడకు రెగ్యులర్‌గా తీసుకెళ్తున్నారు. స్పైసీ ఫుడ్ తిన్నాక డ్రింక్స్, లేదా సాప్ట్ ఐటమ్స్ తినాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

  సహజ సిద్ధంగా లభించే ఈ కోకో ఫ్రెష్ చాలా స్పెషల్ రెసిపీ. కేవలం కోకో ఫ్రెష్ ఒక్కటే కాదు అప్రికాట్ డిలైట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా ఆయన ఇద్దరం టెస్ట్ చేశాం . చాలా బావుంది ఇప్పటి వరకు నగర పరిసరాల్లో ఇలాంటి కొత్త రెసిపీ ఎక్కడా చూడలేదు అని తులసి తెలిపారు.

  కస్టమర్‌ లవకుమార్‌ మాటల్లో…ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల ఈ రెసిపీలను ట్రై చేశాను. అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఉయ్యురు నుంచి విజయవాడ వచ్చి తిని వెళ్తుంటాం. నేను ఒక్కడినే కాక ఫ్యామిలీ ,ఫ్రెండ్స్ తో కూడా ఇక్కడికి వచ్చి తిని వెళ్తుంటాం..ఫుడ్ కూడా చాలా బావుంటుంది. ఫుడ్ లవర్స్ కు ఇదొక బెస్ట్ స్పాట్ అని చెప్పాలి . అప్రికొట్ డిలైట్ లేయర్స్ తింటుంటే చాలా అధ్భుతమైన ఫీల్ ఉంటుంది.

  ఫంక్షన్‌లకు కూడా ఆర్డర్‌లు వస్తున్నాయి…!

  పోటీ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేస్తు ఫుడ్ లవర్స్‌కు కొత్త రెసిపీ అందిచడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎస్కేప్‌ నిర్వాహకులు శ్రీకాంత్‌ తెలిపారు . కోకో ఫ్రెష్, అప్రికట్ డిలైట్‌కు విశేషంగా ఆదరణ లభిస్తోందన్నారు. కోకో ఫ్రెష్ తయారు చేసినప్పటి నుంచి నాలుగు రోజులు పాటు నిల్వ ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

  ప్రస్తుతం చాలా మంది తమ ఫంక్షన్లకు ఈ కొత్త రెసిపీ ఆర్డర్స్ ఇస్తున్నారు. భోజనాల్లో ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కోకోఫ్రెష్ ను సర్వ్‌ చేస్తున్నారు. కేవలం ఈ కోకోనట్‌ రెసిపీనే కాకుండా ఈ హోటల్‌లో చైనీస్‌, ఇండియన్ వెరైటీ ఫుడ్‌ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. స్పైసీ ఫుడ్ అండ్ నాన్ వెజ్ లవర్స్ కోసం కూడా వివిధ రకాల వెరైటీ రెసిపీలు ఈ హోటల్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఓ సారి సరదాగా ఈ కోకోఫ్రెష్ ట్రై చేసి చూడండి.  అడ్రస్ :- గురునానక్ కాలనీ, మెయిన్‌ రోడ్‌, ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రక్కన, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌- 520007
  ఫోన్‌ నెంబర్‌: 9848477774

  ఎలా వెళ్లాలి?

  బస్టాండ్‌ నుంచి గురునానాక్‌ వైపు వెళ్లే సిటీ బస్సులు ఎక్కితే ఈ హోటల్‌కు వెళ్లొచ్చు. లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Local News, Vijayawada

  తదుపరి వార్తలు