Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి (Sankranti) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పెద్ద పండుగలో భాగంగా ఇప్పటికే భోగి (Bhogi) సందడి కొనసాగుతోంది. సందంట్లో సడేమియా అంటూ.. కోడి పందాలు (Cock Fight) కూడా చాలా చోట్ల హోరెత్తుతున్నాయి. ఇప్పటికే పలు బరుల్లో కోడి ఢీ కొడుతోంది. ఉభయ గోదావరి జిల్లా (Godavari Districts) ల్లో అయితే ఆ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) లో కోడి పందెం నిర్వహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. పందెం రాయుళ్ళకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బరిలోకి వచ్చే పందెం రాయుళ్ళకు క్యాసినో తరహా మర్యాదలు సిద్ధం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పందెం రాయుళ్ళ అభిలాషకు అనుగుణంగా వి.ఐ.పి, వి.వి.ఐ.పి వంటి మర్యాదలు సిద్ధం చేశారంటున్నారు స్థానికులు. అలాగే విదేశీ మధ్యం, విందు భోజనం తో పాటు ఉదయం సాయంత్రం అల్పాహారం టీ, కూల్ డ్రింక్స్ వంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారంట నిర్వాహకులు.
దీనికోసం మూడు రోజులకు గాను ఒక్కొక్కరికి 40 వేల రూపాయల నుండి 60వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంట నిర్వాహకులు. ఇక్కడ మరో వెసులు బాటు కూడా ఉంది అంటున్నారు.
ఇదీ చదవండి : భోగీ రోజు చిన్నపిల్లలకు పోసే రేగి పండుతో ఇన్ని ప్రయోజనాలా..? చలికాలంలో ఎందుకు తినాలి..?
ఒకవేళ ఎవరైనా డబ్బులు తీసుకు రాకపోతే.. వారి కొసం యు.పి.ఐ, క్యూ.ఆర్ కోడ్ స్కానర్లు వంటి డిజిటల్ పేమెంట్ వెసులు బాటును కూడా కల్పించారంట నిర్వాహకులు. కోడి పందేలు నిర్వహణ చట్ట విరుద్ధం అని తెలిసి కూడా ఇంతటి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నా అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియక పోవడం ఆశ్ఛర్యకరంగా ఉందంటున్నారు సామాన్యులు.
ఇదీ చదవండి: సీఎం ఇంట అంబరాన్నంటిన సంబరాలు.. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుక
కోడి పందేల నిర్వహణకు వ్యతిరేకంగా కోర్టులు ఎన్ని సార్లు తీర్పులు ఇచ్చినప్పటికీ ఇటు నిర్వాహకులలో కానీ, అటు పోలీసులలో కానీ ఏమాత్రం మార్పు రావడం లేదు. దీనికి కారణం కోడి పందెం నిర్వాహకులకు, పోలీసుల సంపాదనే అంటున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులలోనే కోట్ల రూపాయల్లో ఉంటుందనేది ఒక అంచనా. చాలా వరకు ఇటువంటి కార్యక్రమాలకు పోలీసులతో పాటు రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయనే ఆరోపణలూ లేక పోలేదు.
ఇదీ చదవండి : భోగి మంటల్లో జీవో నెంబర్ వన్.. నారావారిపల్లె వేడుకల్లో చంద్రబాబు
లక్షలు, కోట్ల రూపాయల్లో పందేలు కాసే పందెం రాయుళ్ళకు ఆమాత్రం ఏర్పాట్లు చేయడంలో వింతేముంది అంటున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు గోవ, ముంబై లాంటి సముద్ర తీర మహానగరాలలో మాత్రమే ఉండే క్యాసినో సంస్కృతి ఇప్పుడు సంక్రాంతి పుణ్యమా అని కృష్ణా తీరాన్ని కూడా తాకిందంటున్నారు స్థానికులు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముందన్నట్లు అధికార పార్టీ అండదండలు ఉంటే కోడిపందెం నిర్వాహకులకు భయమేముందంటున్నారు సామాన్యులు. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి కోడి పందెం నిర్వహణ పై కోర్టుల ఆదేశాలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలంటున్నారు సామాన్యులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cock fight, Goa, Makar Sankranti