Home /News /andhra-pradesh /

VIJAYAWADA CJI NV RAMANA VISITED HIS NATIVE VILLAGE PONNAVARAM IN KRISHNA DISTRICT AS MINISTERS AND OFFICIALS AND LOCAL WELCOMES IN GRAND MANNER FULL DETAILS HERE PRN GNT

CJI NV Ramana: మాతృభూమిలో ఎన్వీ రమణ.. పొన్నవరం ప్రజల అభిమానానికి పులకరించిన చీఫ్ జస్టిస్..

పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణ

పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) తన కృష్ణాజిల్లా (Krishna District) వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో పర్యటిస్తున్నారు. గ్రామానికి చేరుకున్న ఎన్వీ రమణకు స్థానికులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగువారి గొప్పతనం గురించి సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) తన కృష్ణా జిల్లా (Krishna District) వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో పర్యటిస్తున్నారు. గ్రామానికి చేరుకున్న ఎన్వీ రమణకు స్థానికులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జస్టిస్ ఎన్వీరణకు జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ స్వాగతం పలికి ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంబభం ఎగురెళ్లగా.. మేళతాళాలతో స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో రోడ్లకు ఇరువైపులా నిల్చొని తనకు స్వాగతం పలికన మహిళలు, విద్యార్థులకు ఎన్వీరమణ అభివాదం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత, నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్, డిఐజి రాజశేఖర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కృతిక శుక్లా తదతరులు పాల్గొన్నారు.

  ఇదిలా ఉంటే స్వగ్రామంలో ఎన్వీ రమణకు బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎడ్లబండిలో ఎన్వీరమణను ఊరేగిస్తూ తీసుకెళ్లి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీజేఐ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. జన్మభూమి, కన్నతల్లి, మాతృభాషను మర్చిపోలేమన్నారు. పొన్నవరం గ్రామంతో తనకు ఎంతో అనుబంధముందన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తాను చదువుకున్నానని.. తన అభివృద్ధిలో కుటుంబ సభ్యుల పాత్ర మరువలేదని ఆయన అన్నారు. చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, చెరువులు ఇప్పటికీ తనకు గుర్తున్నాయన్నారు.

  ఇది చదవండి: రెమ్యునేరషన్ తగ్గుతుందని వారి భయం.. పవన్, నానిపై మంత్రి అనిల్ ఫైర్..

  మనం ఎక్కడున్నా తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్వీరణ పిలుపునిచ్చారు. తెలుగువారి గొప్పదనం గురించి ఢిల్లీలో చాలా మంది చెబుతారని.. తమ రాష్ట్రాల్లో కట్టడాలను తెలుగువారే నిర్మించారని చెప్తూఉంటారని ఎన్వీ రమణ వెల్లడిచారు. తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు, చైతన్యాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

  ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న ఒమిక్రాన్ టెన్షన్.. కొత్తగా మరో రెండు కేసులు


  దేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే అది ప్రజలందరి అభిమానంతోనేని దీనిని మర్చిపోనని ఎన్వీ రమణ అన్నారు. తాను ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదన్న ఎన్వీ రమణ.., తెలుగు ప్రజలు గర్వపడేలా తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు. ఇక రైతులకు కూడా పలు సమస్యలున్నాయని వాటిని అధిగమించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా పంటకు సరైన గిట్టుబాటు ధర, భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాపడ్డారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Krishna District, NV Ramana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు