ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) పర్యటన కొనసాగుతోంది. సీజేఐ హోదాలో తొలిసారి అమరావతి (Capital Amaravathi) కి ఆయనకు స్థానిక రైతులు ఘనస్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా జాతీయ జెండాలతో నిల్చొని ఆయనకు స్వాగతం పలికారు. ఊరేగింపు మధ్య హైకోర్టుకు చేరుకున్న ఆయన్ను.. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్వీరమణను ఘనంగా సన్మానించింది. అనంతరం మాట్లాడిన ఆయన..న్యాయవ్యవస్థ సమాజానికి మార్గదర్శి వంటిదన్నారు. హైకోర్టులో చాలా కేసులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలసని.. త్వరలో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. తాను ఈ ప్రాంతానికి చెందిన వాడినని.. మీ అందరి వాడినని.. మీ అందరి అదరాభిమానలతోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. న్యాయశాఖ కీర్తిని పెంచేలా న్యాయవాదులు, న్యాయమూర్తులు వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
సన్మానం సందర్భంగా తనకు శాలువాలు, బొకేలు ఇచ్చందుకు న్యాయవాదులు, ఉద్యోగులు పోటీపడటంతో తనతో ఫోటోలు దిగడానికి.. శాలువాలు కప్పడానికి పోటీపడవద్దన్నారు. అలాగే తాను మీ వాడనని.. అందరికీ తెలిసిన వాడినేన్న ఆయన.. తాను హీరోను కాదంటూ చలోక్తులు విసిరారు.
అంతకుముందు కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో జస్టిస్ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాసంలో పాల్గొన్న ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. పరిపాలన వ్యావస్థ నుంచి సరైన సహకారం రావకపోవడం ప్రధాన సవాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ప్రభుత్వాలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న ఎన్వీ రమణ.. చట్టం అనేది రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అనేది చూసుకోల్సిన అవసరం ఉందన్నారు.
జడ్జిలపైన జరుగుతున్న దాడులమీద ఎన్వీరమణ మాట్లాడారు. ఇటీవల న్యాయమూర్తులపై భౌతిక దాడులు ఎక్కువయ్యాయని.. అనుకూల తీర్పులు రాకుంటే విమర్శలు కూడా చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిపై కోర్టులు ఆదేశిస్తే తప్ప విచారణ ముందుకు కదలడం లేదన్నారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత న్యాయమూర్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. భద్రత, ఇళ్లు, వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు.
ప్రస్తుతం కోర్టుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఎన్వీ రమణ అన్నారు. ఇందులో 46శాతం ప్రభుత్వ కేసులేనన్నారు. ఇక జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు, ఇంటెలిజెన్స్, ఉన్నతస్థాయి అధికారులు, కొలిజయం పాత్ర ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, NV Ramana