Home /News /andhra-pradesh /

VIJAYAWADA CENTRAL MINSTER KISHAN REDDY SAY SORRY TO AP TDP PRESIDENT ATCHENNAIDU ON MODI TOUR ISSUE NGS GNT

PM Modi Tour: అచ్చెన్నాయుడుకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షమాపణలు. మోదీ టూర్ లో అవమానంపై వివరణ.. అసలు ఏం జరిగింది అంటే?

అచ్చెన్నాయుడుకు సారీ చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అచ్చెన్నాయుడుకు సారీ చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

PM Modi Tour: ప్రధాని మోదీ టూర్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి ఘోర అవమానం జరిగింది.. హెలీప్యాడ్ కు రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కోరారు.. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఆయన్ను అనుమతించలదు.. దీంతో అవమానంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై సారీ చెప్పిన కిషన్ రెడ్డి.. అసలు ఏం జరిగింది అన్నదానిపై వివరణ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)- ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugdu Desam) మధ్య సాగుతున్న పోరు ప్రభావం ప్రధాని మోదీ పర్యటన (Prmime Minster Modi tour) పైనా పడింది. ఈ కార్యక్రమానికి టీడీపీ (TDP),  జనసేన (Janasean)తో పాటు తన ప్రత్యర్ధి పార్టీల నేతలకు అనుమతి లేకుండా చేశారు ఏపీ అధికారులు. దీంతో భీమవరం (Bheemavaram)లో జరిగిన ప్రధాని మోదీ టూర్ కు టీడీపీ తరఫున ఆహ్వానించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu)కు తీవ్ర అవమానం ఎదురైంది. ప్రధాని టూర్ కు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు కిషన్ రెడ్డి (Kishan Reddy) రాసిన లేఖకు స్పందనగా ఆయన అక్కడికి వెళ్లారు అయితే హెలీప్యాడ్ కు చేరుకోవాలనుకున్న అచ్చెన్నాయుడిని భీమవరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి అడ్డుకున్నారు.

    కిషన్ రెడ్డి ఆహ్వానించారని. ఎస్పీజీ అనుమతి ఉంది అని చెప్పినా కలెక్టర్ మాత్రం తనకు ఇచ్చిన లిస్ట్ లో పేరు లేదంటూ నిలిపివేశారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన నేరుగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. తనను ప్రధాని పర్యటనకు పిలిచి అవమానించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. పిలిచి మరీ అనుమతించకుండా ఆవమానించారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని టూర్ కు వచ్చే నేతల జాబితాలో రాత్రి వరకూ తన పేరు ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే తన పేరు తీసేసారని ఆయన ఆరోపించారు.



    ఏపీ అధికారుల తీరుతో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగినట్లయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. కానీ తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తన జాబితాలో లేదని తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : చిరు ధాన్యాలతో భారీ లాభాలు.. రూటు మార్చిన ఏజెన్సీ రైతులు..?

    తాజాగా అచ్చెన్నాయుడి ఆవేదనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని టూర్ తర్వాత మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి అచ్చెన్నాయుడుకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన జాబితాలో పేరు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు బాధ్యతగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, Kishan Reddy, Pm modi, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు