Andhra Pradesh: మే 7న ఏం జరగబోతోంది? బీజేపీకి అంతా తెలుసా? సీఎం జగన్ కు సీబీఐ నోటీసులు

వైఎస్ జగన్, సీబీఐ లోగో

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? మే నెల 7న విచారణలో సీబీఐ కోర్టు ఏం చెప్పబోతోంది? డిల్లీల్లో ఉన్న పెద్దలకు తెలిసే బెయిల్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చిందా? ప్రస్తుతం ఏపీలో ఈ టాపిక్ హాట్ హాట్ గా మారింది.

 • Share this:
  ఏపీ సీఎం జగన్ ఏ క్షణమైనా జైలుకు వెళ్లొచ్చు అంటూ  ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి సీఎంగా కొనసాగుతున్నారని ఆయన బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని సునీల్ దేవ్ దర్ జోస్యం చెప్పారు.. తాజాగా మరో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సైతం అదే అర్థం వచ్చేలా విమర్శలు చేశారు. మూడేళ్లు సీఎంగా జగన్ ఉంటారనుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణు కుమార్ రాజు.. ఇక బీజేపీ జాతీయ నేత ఎవరు ఏపీకి వచ్చినా వారు మొదట మాట్లాడేది ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించే..

  తాజగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇదంతా బీజేపీకి తెలిసే జరుగుతోందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా వైస్ జగన్ అభిమానులు ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు వెనుక బీజేపీ నేతలు ఉండి ఇలాంటి బెదిరింపు రాజీకయాలకు తెర తీస్తున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతల సూచన మేరకే రఘురామ తల ఊపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అభిమానుల విమర్శలు ఎలా ఉన్నా.. సీఎం జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందుకే ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ తిరుబాటు ఎంపీ రఘరామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వచ్చే నెల 7వ తేదీన కోర్టు విచారణ చేపట్టనుంది.

  ఇదీ చదవండి: ఏపీలో మినీ లాక్ డౌన్. కొత్త ఆంక్షలు ఏంటి? కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం

  సీఎం స్థానంలో ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందట రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయగా, తొలుత సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది. అయితే కొన్ని సవరణల అనంతరం రఘురామ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఈసారి స్వీకరించింది. మే ఏడున విచారణ చేపట్టేందుకు ఆంగీకరించింది. ఈ విచారణ నేపథ్యంలోనే జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

  ఇదీ చదవండి: 5 నుంచి ఇంటర్ పరీక్షలు. ప్రతి సెంటర్ లో కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ నియామకం

  తాజా నోటీసులతో మళ్లీ జగన్ బెయిల్ అంశం చర్చనీయాంశగా మారింది. త్వరలో జగన్ జైలుకు వెళ్తారంటూ టీడీపీ నేతలు సైతం పదే పదే విమర్శిస్తున్నారు. ఇటు సందర్భం వచ్చిన ప్రతిసారి బీజేపీ నేతలు సైతం జగన్ బెయిల్ త్వరలో రద్దవుతోందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు కోర్టును ఆశ్రయించండంతో.. ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు, అభిమానులే ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పెద్దలే వెనుక ఉండి ఈ వ్యహారాన్ని నడిపిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: