Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల కారణంగా గాయాలవడమే కాదు.. చేసిన తప్పుకు కేసుల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. అలా కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండగా సడన్ గా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంకేముంది దెబ్బల సంగతి దేవుడెరుగు.. అందరూ బ్రతుకుజీవుడా అంటా పరుగులుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా (NTR District) తిరువూరు మండలం లక్ష్మీపురం సమీపంలోని జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. అయితే అందులోని వాళ్లు హెల్ప్ అని అడగటానికి బదులు.. అక్కడ నుంచి పరుగో పరుగు. అదేంటని అక్కడకు వెళ్లి చూస్తే మొత్తం మద్యం సీసాలే.. కారు బోల్తా పడ్డ ప్రాంతమంతా చెల్లాచెదురుగా మద్యం సీసాలు పడిఉండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న సెక్టార్ వన్ ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు మీద మద్యం సీసాలు పగిలి ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు ఆ మద్యం సీసాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనాలు రాకపోకలు సాగాయి. కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరిస్తామని సమగ్ర దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు.
భర్త పొమ్మన్నాడు.., తండ్రి మందలించాడు..ఏం చేయాలో పాలుపోక..!
రత్నశ్రీ, రాజు ప్రేమించుకుని ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రాజు ఈవెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతను మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రశ్నించిన భార్యను మానసికంగా శారీరకంగా వేధించేవాడని తెలుస్తోంది. దీంతో భర్త ఆగడాలు భరించలేక రత్నశ్రీ ఐదు రోజుల కిందట గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈ నెల నాలుగో తేదీ తన భర్త కావాలని వెళ్ళగా ఆమెను కొట్టి పంపించాడు. మళ్లీ పుట్టింటికి వస్తే.. భర్త దగ్గరికే వెళ్ళమని తండ్రి మందలించాడు.
అయినా ఆ రాత్రి పుట్టింట్లోనే నిద్రించి ఉదయాన్నే చూస్తే రత్నశ్రీ కనిపించలేదు. బంధువులు తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. తండ్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ (Vijayawada) సూర్యారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేసే ఓ వివాహిత ఆదివారం సాయంత్రం నుంచి కపించకపోవడంతో ఆమె భర్త సూర్రావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొగల్రాజపురానికి చెందిన యువకుడికి గతనెల్లో యువతితో వివాహం జరిగింది. ఈ సూర్యరావుపేటలోని ఓ ఆసుపత్రిలో డయాలసిస్ టెక్నీషియన్‌గా ఆమె పనిచేస్తుంది.
ఆదివారం ఉదయం 6 గంటలకు యధావిధిగా ఆమె భర్త ఆసుపత్రిలో దింపారు. రాత్రి 8 గంటలైనా రాకపోవడంతో ఆమెకు పోన్ చేస్తే స్విచ్ఆఫ్ రావడంతో ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. ఆమె మధ్యాహ్నం 1.45 నిమిషాలకు బయటకు వెళ్లినట్లుగా అక్కడి సిబ్బంది తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో సూరిరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada