హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Buper Offer: 5 పైసల కాయిన్ తెచ్చుకోండి..? స్టార్ భోజనం ఫ్రీగా పొందడి. 400 రూపాయలు ఉచితమే..

Buper Offer: 5 పైసల కాయిన్ తెచ్చుకోండి..? స్టార్ భోజనం ఫ్రీగా పొందడి. 400 రూపాయలు ఉచితమే..

5 పైసల కాయిన్ తెండి.. 400 రూపాయల ఫ్రీ భోజనం తినండి

5 పైసల కాయిన్ తెండి.. 400 రూపాయల ఫ్రీ భోజనం తినండి

Buper Offer: ఆంధ్రప్రదేశ్ లో భోజన ప్రియులు చాలామందే ఉంటారు..? 400 రూపాయల విలువుగల భోజనం ఉచితంగానే వస్తోంది అంటే.. ఎవరు ఊరుకుంటారు.. 5 పైసల కాయిన్ తెచ్చుకోండి.. ఫ్రీగా స్టార్ భోజనం పొందడి అని ఆఫర్ ప్రకటించడమే లేటు.. ఎక్కలేని జనాలు అంతా ఆ షాపు ముందే కనిపించారు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Bumper Offer: సాధారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భోజన ప్రియులు (Food Lovers) చాలామందే ఉన్నారు.. మంచి టేస్ట్ ఫుడ్ ఎక్కడ దొరికి వెతికి మరి వెళ్లి తింటూ ఉంటారు. కొంతమంది హోటల్ ఓనర్లు (Hotel Owners) కష్టమర్లను అట్రాక్ట్ చేయడానికి భలే భలే ఆఫర్లు పెట్టి.. కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటారు.. అలాంటి సూపర్ ఐడియాతో ఓ హోటల్ ఓనర్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు.. సాధారణంగా దేశంలో ఒకప్పుడు 5 పైసల కాయిన్స్ చలామణీలో ఉండేవి. ఇప్పుడు ఆ కాయిన్స్ కనపడడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ (Vijayawada) లోని ఓ రెస్టారెంటు (Restruant) ఓ ఆఫర్ పెట్టింది, 5 పైసల కాయిన్ తీసుకొస్తే 400 రూపాయల విలువచేసే శాకాహార భోజనం (Veg Meals) ఉచితంగా తినొచ్చని పేర్కొంది. 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని.. ఇంకా ఐదు రూపాయల కాయిన్స్ ఇంతమంది దగ్గర ఉన్నాయా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.

విజయవాడలోని ఓ రెస్టారెంటు బంపర్ ఆఫర్ పెట్టింది. కేవలం 5 పైసల కాయిన్ తీసుకొస్తే 400 రూపాయల విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. అంతేకాదు 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Bumper Offer Food Lovers || ఐదు పైసల కాయిన్ తెండి || రూ. 400 ఫ్రీ భోజనం ... https://t.co/vTXML5Sikc via @YouTube #food #foodie #foodshortage #foodphotography #FoodFriday #foodies #hotels #Offers

ఎందుకంటే ఊహించని స్థాయిలో ఆ హోటల్ కు భారీగా జనాలు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని అంటున్నారు.

ఇదీ చదవండి : మీరిచ్చిన మనోధైర్యమే ముఖ్యమంత్రిని చేసింది.. సొంత నియోజకవర్గం సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు

దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా అందరికీ సగం ధరకే అంటే 200 రూపాయలకే ఇచ్చామని చెప్పారు. ఆ ఆఫర్ కారణంగా.. ఇప్పుడుతమ రెస్టారెంటు బాగా ఫేమస్ అయిపోయిందని సంబరపడిపోయారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Vijayawada

ఉత్తమ కథలు