K Pawan Kumar, News18, Vijayawada
ప్రస్తుతం ఏపీకి రాజధాని ప్రాంతంగా ఉంది విజయవాడ (Vijayawada). అందుకే ఇక్కడ పోలీసులు శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టిపెడుతుంటారు. అయినా కానీ కొన్ని ముఠాలు క్రైమ్ రేట్ పెంచేందుకు ట్రై చేస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడను హడలెత్తించే బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కష్టపడి సంపాదించడానికి ఇష్టపడక ఎదుటి వారిని బెదిరించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డారు బ్లేడ్ బాచ్. అలా డబ్బులు సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో రోడ్ మీద కనిపించిన పెద్దవాళ్ళు,ఆడవాళ్లు , బైకులపై వెళ్తున్నవారిని ఆపి వీరంగం వేసి బెదిరించి డబ్బులు తీసుకునే వారు. కానీ ఇప్పుడీ కేటుగాళ్లు రూటు మార్చారు. పెద్దవాళ్ళని బెదిరిస్తే వారు కూడా ఎదురు తిరుగుతారని బయమేసిందో ఏమో స్కూల్‌కి వెళ్లే చిన్నపిల్లలను కూడా వదలకుండా వారి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
తాజాగా విజయవాడలో స్కూల్ పిల్లలను అటకాయించిన బ్లేడ్ బ్యాచ్.. వారి దగ్గరున్న డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. వారి వద్ద నుంచి తెలివిగా తప్పించుకున్న పిల్లలు.. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ బ్లేడ్ బ్యాచ్ సభ్యులు.., స్కూల్ విద్యార్థులను ట్రాప్ చేస్తూ వారికి చెడు అలవాట్లును నేర్పిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
బ్లేడ్ బ్యాచ్ అగడాలతో పోలీసులు స్కూల్స్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చెడు అలవాట్లు నేర్పుతున్న వారిపై ఫోకస్ పెట్టి బ్లేడ్ బ్యాచ్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఐతే బ్లేడ్ బ్యాచ్ ఆగడాలతో బెంబేలెత్తిపోతున్న తల్లిదండ్రులు వారి పిల్లల్ని స్కూల్ కి పంపాలంటే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు నుండి స్కూల్ యాజమాన్యానికి ఒత్తిడి పెరగడంతో యాజమాన్యం కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు స్కూల్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి గంజాయి, బ్లేడ్ బాచ్ పై ఫోకస్ పెంచారు.
పిల్లలు భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను స్కూల్‌కి పంపుతుంటే ఒక పక్క చిన్న పిల్లలపై అఘయిత్యాలు మరో పక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు చెలరేగడంతో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి స్వేచ్ఛాయిత వాతావరణ కల్పించాలని సిటీ పోలీసులను వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada