K Pawan Kumar, News18, Vijayawada
విజయవాడ (Vijayawada) లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రిళ్లు జనం రక్షణకు గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇప్పటికే తాడేపల్లి, ఉండవల్లి వాసులు గంజాయి బ్యాచ్ ఎప్పుడూ ఎవరి మీద దాడి చేస్తారో, ఎప్పుడూ ఏమవుతుందా అని భయాందోళన చెందుతున్నారు. తాజాగా ప్రకాశం బ్యారేజీపై జరిగిన ఘటన బెజవాడలో కలకలం రేపిది. ప్రకాశం బ్యారేజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ప్రకాశం బ్యారేజీ పై కూడా ఎంతో మంది జీవిస్తున్నారు. కొందరు బ్యారేజీపై ఉంటూ, అక్కడే నిద్రిస్తూ ఎవరైనా ఒక ముద్ద పెడితే కడుపు నింపుకుని బతికేస్తుంటారు కొందరు. మరి కొందరు అక్కడ, ఇక్కడ పనులు చేసుకుని ఫూట్ ఫాత్ మీదనే తిని అక్కడే నిద్రపోతుంటారు.
అలాంటి అభాగ్యులపైనా బ్లేడ్ బ్యాచ్ కన్నుపడింది. సీతానగరం ప్రకాశం బ్యారేజీ 29వ గేటు వద్ద నిద్రిస్తున్న చెన్నైకి చెందిన సుందరం సుకుమార్, మోహన్ ఇద్దరి వ్యక్తులను నగదు ఇవ్వాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు డిమాండ్ చేసారు. తమ దగ్గర ఏమీ లేవని చెప్పడంతో కోపోద్రుక్తులై అక్కడితో వారిని వదిలిపెట్టకుండా వెంటాడి మరి కర్రలతో ఇద్దరిని చితకబాదారు.
విచక్షణరహితంగా కర్రలతో బాదటంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో అక్కడే నిద్రిస్తున్న కొంతమంది భయంతో పారిపోయారు. ఇంతలో 108కు సమాచారం రావడంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada