హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబు, లోకేష్‌కి దాన్ని చూస్తేనే భయం..హాట్‌ టాపిక్‌గా మారిన ఏపీ బీజేపీ నేత వ్యాఖ్యలు..

చంద్రబాబు, లోకేష్‌కి దాన్ని చూస్తేనే భయం..హాట్‌ టాపిక్‌గా మారిన ఏపీ బీజేపీ నేత వ్యాఖ్యలు..

ADINARAYANAREDDY

ADINARAYANAREDDY

bjp leader Adinarayana hot comments: మాజీ మంత్రి వైఎస్‌ వివేక హత్య కేసులో చంద్రబాబు, లోకేష్‌ తనను ఇరికించాలని వైసీపీ చూసిందన్నారు ఏపీ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. నాకు ఫ్యాక్షన్‌ గొడవలతో సంబంధం ఉన్న మాట వాస్తవమే కానీ చంద్రబాబు, లోకేష్‌కి అలాంటి వాటితో సంబంధం లేదన్నారాయన. ప్రజా ఆగ్రహ సభలో టీడీపీ అగ్రనేతలపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఇలా స్పందిస్తే..మరో నేత సుజనాచౌదరి ఇంకోలా రియాక్ట్ అయ్యారు.

ఇంకా చదవండి ...

రాయలసీమకు చెందిన ఓ బీజేపీ నేత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారాయి. బెజవాడ వేదికగా జరిగిన ప్రజా ఆగ్రహ సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ హత్యా రాజకీయాలపై నిప్పులు చెరిగారు. హత్యలు చేసేది వాళ్లు..నెట్టేది మాపైనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాదు తాను ఫ్యాక్షనిస్టునే అని చెప్పారు ఆదినారాయణరెడ్డి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ రక్తాన్ని చూస్తేనే భయపడిపోతారని అలాంటి వాళ్లకు వైసీపీ నేతలు హత్యా రాజకీయాలను అంటగట్టాలని చూశారంటూ కామెంట్ చేశారు. కడప జిల్లాలో జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రధారులు ఎవరో..? సూత్రధారులు ఎవరో ? అందరికి తెలుసన్నారు ఆదినారాయణరెడ్డి. అందుకే ఆ కేసులో వైసీపీ నేతల పేర్లే బయటకు వచ్చాయని..వాళ్లే విచారణ ఎదుర్కొంటున్నారని..జైలుకు వెళ్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.

వాళ్లిద్దరూ అలాంటి వాళ్లు కాదు..

వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేందుకు కమలనాథులు ప్రజా ఆగ్రహ సభ నిర్వహించారు. ఈ వేదికపైనే బీజేపీకి చెందిన మరో నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవర్ని వదిలిపెట్టం..అందరి సంగతి చూస్తానంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు సుజనాచౌదరి. ఇలాంటి విద్వేషపూరితమైన మాటలతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు.

మాజీ టీడీపీ నేతల మాటల వెనుక మర్మం ఏమిటీ..

జాతీయ నాయకులు సైతం హాజరైన ప్రజా ఆగ్రహ సభా వేదికపై రాష్ట్ర బీజేపీ నేతలు చంద్రబాబు, లోకేష్ విషయంలో తలోమాట మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్‌కు హత్యా రాజకీయాలు తెలియదని ఆదినారాయణరెడ్డి అంటే.. లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని సుజనాచౌదరి చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలనే ప్రశ్నలు ఏపీ బీజేపీ నేతలను సంధిస్తున్నాయి.

ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు..?

ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. పాలనపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న కమలం నేతలు.. దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. బెజవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ..వైసీపీ విమర్శిస్తున్న బీజేపీ నేతల్లో కొందరు టీడీపీని కూడా కలిసి తిట్టిపోస్తే..మరో నేత మాత్రం టీడీపీ అధినాయకులకు ఏ పాపం తెలియదనడం కొసమెరుపు.

First published:

Tags: Ap bjp, Chandrababu Naidu, Ys viveka murder case

ఉత్తమ కథలు