VIJAYAWADA BIRTHDAY CELEBRATIONS FOR TRAIN PINAKANI EXPRESS COMPLETES 30 YEARS SERVICE IN VIJAYAWADA PRN VPR NJ
Vijayawada: ట్రైన్ బర్త్ డే వేడుకలు ఎప్పుడైనా చూశారా..? పినాకినికి 30 ఏళ్లు
విజయవాడలో పినాకిని ఎక్స్ ప్రెస్ కు బర్త్ డే
సాధారణంగా ప్రతి ఏడాది అందరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. కేక్ కట్ చేస్తాం..ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు పార్టీలిస్తాం… అందులో పెద్ద వింత ఏమి లేదు. కానీ, ఒక ట్రైన్ పుట్టినరోజు వేడుక చేసుకోవడం ఎప్పుడైనా చూశారా..! అయితే ఇప్పుడు చూడండి.
సాధారణంగా ప్రతి ఏడాది అందరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. కేక్ కట్ చేస్తాం.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు పార్టీలిస్తాం.., అందులో పెద్ద వింత ఏమి లేదు. కానీ, ఒక ట్రైన్ పుట్టినరోజు వేడుక చేసుకోవడం ఎప్పుడైనా చూశారా.. అచ్చం మనలాగే కేక్ కటింగ్.. బర్త్ డే సాంగ్స్ తో.. అయితే ఒక్కసారి ఈ స్టోరీ చదవండి మీకే అర్థం అవుతుంది. ప్రపంచంలో ఇప్పటివరకు మనుషుల బర్త్‌డేలు, ఇంకా కొంత మంది తమ పెంపుడు జంతువులకి కూడా పుట్టిన రోజులు జరిపిన సంఘటనలు చాలా చూశాం. ఇవ్వని పక్కన పెడితే కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏకంగా ట్రైన్‌కు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇదేక్కడో విదేశాల్లో కాదండి.. మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) నగరంలోనే.
ఇంతకీ ట్రైన్‌కు పుట్టినరోజేంటి..?
విజయవాడ నుంచి చెన్నై మధ్య తిరిగే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కే( pinakini super fast express) పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ రైలు పట్టాలెక్కి…జులై 1వ తేదికి సరిగ్గా ముప్పై ఏళ్లు (30years) అయ్యింది. అందుకే విజయవాడ రైల్వే అధికారులు… తమ సొంత బిడ్డకు చేసినట్లుగా రైలుకు బర్త్‌డే సెలబ్రేషన్స్ (Birthday Celebrations) చేశారు. తెల్లవారుజామునే ట్రైన్‌కు తలంటు పోసి అదేనండి శుభ్రంగా కడిగి.. అందమైన డ్రస్ అంటే రంగు రంగు కాగితాలు అంటించి తళతళలాడేలా చేశారు. విజయవాడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్లో ప్రత్యేకంగా పాతకాలపు WAM-4 లివరీ ఫ్యాషన్‌లో పెయింట్ వేయించారు. ఇక తెలుగు తనం ఉట్టేపడేట్లుగా రకరకాల పులతో అలంకరించారు.
అందంగా ముస్తాబైన ట్రైన్.., కేక్ కట్ చేసేందుకు ఫ్లాట్‌ఫామ్ మీదకు వచ్చింది. అప్పటికే ఫ్లాట్‌ఫామ్ మీద కేక్‌కటింగ్ సెటప్ అంతా రెడీ చేసి ఉంచారు అధికారులంతా. ట్రైన్ రావడంతో బర్త్‌డే పాటలు పాడుతూ.., కేకే కట్ చేశారు. అనంతరం పచ్చ జెండా ఊపి.. విజయవాడ రైల్వే డివిజన్‌కు మరింత మంచి పేరు తేవాలని ఆశీర్వదించారు. ఈ తతంగం అంతా చూస్తున్న ప్రయాణికులు..మొదట్లో ఏం అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత తెలుసుకుని వాళ్లు కూడా పినాకిని ట్రైన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ తర్వాత ఆ ట్రైన్ చరిత్ర, విశేషాలు తెలుసుకునేందుకు అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ట్రైన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది …!
గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా సేవలందిస్తున్న అత్యుత్తమ ఇంటర్ సిటీ రైలు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన పినాకిని ఎక్స్‌ప్రెస్ జులై1న తన 30 సంవత్సరాల సేవలను పూర్తి చేసింది. ఎంతోమందిని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చింది.
ట్రైన్ నెంబర్. 12711 / 12712 పినాకిని ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లో ప్రవహించే పెన్నా లేదా పినాకిని నది (Penna river) నుండి ఈ ట్రైన్‌కు ఆ పేరు వచ్చింది, ఇది విజయవాడ నుండి జూలై 01, 1992న ప్రారంభించబడింది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని (south central railway zone) విజయవాడ జంక్షన్‌ని…. దక్షిణ రైల్వే జోన్‌లోని తమిళనాడు రాష్ట్ర రాజధాని MGR చెన్నై సెంట్రల్‌కి కలిపే రోజు వారీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.
ప్రయాణికులు ఆదరించే పినాకిని ఎక్స్ ప్రెస్..!
ఈ రైలు ఒక ట్రిప్‌కు 430 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఆ మార్గమధ్యంలో 12 హాల్ట్లను కలిగి ఉంటుంది. పినాకిని ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల (Passengers) నుంచి అద్భుతమైన ప్రోత్సాహాన్ని పొందుతుంది. ఇంకా చెప్పాలంటే ఏడాది పొడవునా ఆక్యుపెన్సీ (Occupancy) రేటు వందశాతం కంటే ఎక్కువగా ఉంటుంది. కృష్ణ, గుంటూరు, ప్రకాశం మరియు SPSR జిల్లాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు, సీజన్ టిక్కెట్ హోల్డర్లు ప్రతిరోజూ ఈ రైలు ఎక్కుతారు. మాములుగా ట్రైన్లు లేటుగా వస్తుంటాయి అని సెటర్లు వస్తుంటాయి..కానీ ఈ ట్రైన్ పర్ఫెక్ట్ టైమ్ మరియు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రయాణికుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.