హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఐటీ దాడులు.. ఈడీ నోటీసులు.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతోంది..?

AP Politics: ఐటీ దాడులు.. ఈడీ నోటీసులు.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతోంది..?

ఐటీ, ఈడీ దాడులతో వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

ఐటీ, ఈడీ దాడులతో వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో అలజడి పెరుగుతోంది. వరుస ఐటీ దాడులు.. ఈడీ నోటీసులతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. వరుసగా వైసీపీ నేతల ఇళ్లలో ఇలా రైడ్స్ జరుగుతుండడంతో.. ఏం జరుగుతోంది అనే వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైంది..

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

AP Politics: మొన్నటి వరకు తెలంగాణ (Telangana) లో  ఉన్న నేతలపై ఐటీ దాడులు (IT Rides).. ఈడీ నోటీసు (ED Notice) లతో పరిస్థితి ఉత్కంఠగా కనిపించింది. కేవలం రాజకీయ కక్షతోనే.. బీజేపీ (BJP).. ఇలా టీఆర్ఎస్ నేతల (TRS Leaders) ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా మడిపడుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలోనూ కలకలం మొదలైంది. వైసీపీ నేతలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. ఈడీ నోటీసులు అందుతున్నాయి. తాజాగా వైసీపీలో కీలకంగా మారిన దేవినేని అవినాష్ (Devineni Avinash), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ల ఇళ్లపై ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతుండం.. రాజకీయంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలోనే కాదు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి.. మొన్నటికి మొన్నఅక్కినేని ఉమెన్ హాస్పిటల్‌, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో ఈ దాడులు కొనసాగాయి. తాజాగా విజయవాడలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

మొత్తం ఐదు బృందాల అధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.. వైఎస్సార్‌సీపీ నేత అయిన దేవినేని అవినాష్‌.. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. ఉదయం నుంచి విజయవాడ గుణదలలోని ఆయన నివాసంతో పాటూ మరికొన్ని చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరుగుతునే ఉన్నాయి. అయితే, ఏ కేసులో ఈ సోదాలు సాగుతున్నాయి.. ఐదు బృందాలు ఎందుకు రంగంలోకి దిగాయి అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్‌ అధినేత, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలతో పాటు మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి : శ్రద్ధా తరహాలో విశాఖలో దారుణం.. ప్లాస్టిక్ డ్రమ్ములో ముక్క ముక్కలుగా వివాహిత మృతదేహం

హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఐటీ అధికారులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi) ఇంటిలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ తెలంగాణ ఎమ్మెల్సీ కవితో పాటు.. వైసీపీ ఎంపీ మాగుంట శ్ర్రీనివాసులు పేరు చేర్చడం కూడా చర్చనీయంగా మారింది. మరోవైపు ఈ కేసులో విజయసాయి రెడ్డి అల్లుడి పాత్రపైనా తీవ్ర విమర్శలు వినిపించాయి. ఆ స్కామ్ వివాదం కొనసాగుతున్న సమయంలో వైసీపీకే చెందిన ఇద్దరు కీలక నేతలపై ఐటీ దాడులు జరుగుతుండడంతో.. ఏం జరుగుతోందని వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు