హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కార్యాలయాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ.. అత్యవసరం అయితే?

Big Shock: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కార్యాలయాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ.. అత్యవసరం అయితే?

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

Big Shock: ఆంధ్రప్రదేశ్ లోని ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగలకు షాక్ ఇచ్చారు ఉన్నతాధికారులు.. ఇకపై విధుల్లో ఉండగా ఫోన్లు వాడడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Big Shock: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం ఉద్యోగులు.. ఉన్నతాధికారుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులకు అధికారులు మరో షాక్ ఇచ్చారు. కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్ APPCPDCL) ఉద్యోగులకు మెమో జారీ చేసింది. ఈ నిబంధన

  అక్టోబరు 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది అంటున్నారు అధికారులు.. గత కొంతకాలంగా అక్కడి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పని వేళల్లో సరిగ్గా విధులు నిర్వహించడం లేదని.. సమస్యలను పట్టించుకోవడం లేదని.. అధిక సమయంలో ముబైల్ ఫోన్లు చూసుకునేందుకు కేటాయిస్తున్నారని ఫిర్యాదు అందాయి. ఒకరిద్దరు కాదు.. మెజార్టీ ఉద్యోగుల తీరు ఇలానే ఉందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటున్నారు అధికారులు..

  డిస్కంల ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారని ఈ నెల 19న విడుదల చేసిన మెమోలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి పేర్కొన్నారు.

  మెజార్టీ ఉద్యోగులకు ఇలా ఫోన్లతో కాలాక్షేపం చేయడం కారణంగా

  పనిని వాయిదా వేస్తున్నారని.. దీంతో సమస్యలు పేరుకుపోతున్నాయని.. అవి పేరుకుపోవడం కారణంగా ఆ సమస్యలను గుర్తిండం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేటింగ్ అధికారులు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో.. ఎక్కువ సమయం స్మార్ట్ పోన్ లతోనే కాలక్షేపం చేస్తున్నట్టు తమకు తెలిసిందని.. ఆ కారణంతోనే పనిని వాయిదా వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇకపై పనిగంటలు వృథా కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

  అక్టోబరు 1వ తేదీ నుంచి ఉద్యోగులు కార్యాలయానికి వచ్చిన వెంటనే తమ ఫోన్లను డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలని సూచించారు. అయితే

  భోజన విరామ సమయంలో మాత్రం వాడుకునేందుకు అవకాశం ఉంటుందని, ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని పద్మాజనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఎవరికైనా

  అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే మాత్రం పై అధికారి ఫోన్ నంబరు ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  సీజీఎం, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కిందిస్థాయిలో  ఈ ఆదేశాలు జారీ చేయాలని సీఎండీ పేర్కొన్నారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు అలా చేస్తే.. అందరికీ శిక్ష విధిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గదే లే అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, ELectricity

  ఉత్తమ కథలు