హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Employees: జగన్ సర్కార్ కు షాక్.. యధావిధిగా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ.. ఏపీ జేఏసీ కీలక ప్రకటన

AP Employees: జగన్ సర్కార్ కు షాక్.. యధావిధిగా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ.. ఏపీ జేఏసీ కీలక ప్రకటన

జగన్ సర్కార్ కు అల్టిమేటం

జగన్ సర్కార్ కు అల్టిమేటం

AP Employees: జగన్ సర్కార్ కు షాక్ ఇవ్వాలని ఏపీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం పెద్దలు ఇచ్చిన హామీలపై నమ్మకం లేదని.. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తగ్గేదే లే అని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. చిన్న చిన్న మార్పులతో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశాయి..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

AP Employees: ఆంధ్రప్రదేశ్ సర్కార్ (Andhra Pradesh Government) వర్సెస్ ఏపీ ఉద్యోగుల (AP Employees) వార్ పీక్ చేరింది. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని.. అందుకే వారి కోసం రెండు మెట్లు కిందకు దిగామని ప్రభుత్వం పెద్దలు చెప్పారు. ఈ నెల ఆఖరికి బకాయిలు చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చారు.. కానీ ఉద్యోగులు మాత్రం ఆ హామీలను నమ్మడం లేదు. ప్రభుత్వం తీరును తప్పు పడుతూ.. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు ఏపీ జేఏసీ అమరావతి (Amaravati JAC) కన్వీనర్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswaralu). ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందన్నారు. అయితే మొదట వెల్లడించినట్టు కాకుండా.. చిన్న చిన్న మార్పులతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రులు చెప్పడం జరిగిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు.

తామిచ్చిన వినతిపత్రంపై చర్చ చేయకుండా పాత సమస్యలపై మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన 2 వేల కోట్లు సెప్టెంబర్ లోపు చెల్లిస్తామన్నారు. డీఏ, అరియర్స్ ఎంత ఇవ్వాలి అన్నది స్పష్టత లేదన్నారు.

తాము చెప్పిన అంశాలపై చర్చ లేకుండా వాళ్లు చెప్పాలనుకున్నవి చెప్పి వెళ్లిపోతే ఈ సమావేశాలు.. చర్చలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ 11వ పీఆర్సీ, పే స్కెల్ పై స్పష్టత లేదని. అసలు ఎంతుందో చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పీఆర్సీ అరియర్స్ ఎంత బకాయిలు ఉన్నాయో చెప్పాలి. దీనికి తోడు జీతాలు ప్రతి నెల 1వ తారీకునే ఇవ్వాలని కోరినా మంత్రుల కమిటీ స్పందించ లేదు. సీపీఎస్ ఉద్యోగుల 1300 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి అది కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఇదీ చదవండి: : టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యే రీ ఎంట్రీ..? శిల్పా చక్రపాణి రెడ్డి క్లారిటీ..

ఏప్రిల్ నుంచి జీపీఎస్ కు సంబంధించిన ఉద్యోగులకు సమాచారం రావడం లేదన్నారు. ప్రభుత్వం నెలాఖరులోగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులు ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇక సీపీఎస్ రద్దు అంటుంటే జీపీఎస్ అంటున్నారని... పాత పెన్షన్ తప్ప ఇతర ఏది తీసుకొచ్చినా అందుకు తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని జగనే హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అమలు చేయాలని అడుగుతుంటే స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :విజయవాడలో బాలయ్య సందడి.. అన్‌స్టాపబుల్‌ దూకుడు.. ఫ్యాన్స్ పై ఏమన్నారంటే..?

ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగానే ఉద్యమం విషయంలో ముందుకే వెళ్తున్నామన్నారు. చిన్న చిన్న మార్పులు చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం అన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. ఈ నెల 17, 20వ తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల సందర్శన ఉంటుందన్నారు. 21 నుంచి వర్క్ రూల్ కొనసాగుతుందన్నారు. 26న కారుణ్య నియామకాలు కుటుంబాల సందర్శన యాత్ర చేపడతామని.. వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఈ రోజు నుదిటిపై కుంకుమ లేదు.. కారణం ఎవరు.. పరిటాల సునీత భావోద్వేగం.. ఏమైందంటే..?

ఇక ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించి ఉద్యమంలో కలిసి రావాలి అని ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే మరోసారి భారీ ఉద్యమం తప్పేలా లేదు.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, Employees, Vijayawada

ఉత్తమ కథలు