హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Alert to Students: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఎలా నిర్వహిస్తారంటే?

Alert to Students: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఎలా నిర్వహిస్తారంటే?

పాఠశాలల్లోనూ సెమిస్టర్ విధానం

పాఠశాలల్లోనూ సెమిస్టర్ విధానం

Alert to Students: ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్నట్టు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇందులో భాగంగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూల్స్ లో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Alert To Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ చేసింది. సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. విద్యా, వైద్య రంగాలపైనే అత్యధికంగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక  లెక్క ఇకపై ఒక లెక్క అన్న మాదిరిగా.. పూర్తి మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఇప్పటికే అనేక మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ (AP Government) అడుగులు వేసింది.. వేస్తూనే ఉంది. నాడు - నేడు (Nadu Nedu) పథకం కింద పాఠశాలల రూపురేఖలను మారుస్తోంది. మరోవైపు విద్యా దీవెన పథకం (Vidya Deevena Scheme) కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సర్కార్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతి వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్నారు. 2024-25 నుంచి పదో తరగతిలోనూ సెమిస్టర్‌ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. అందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా జగనన్న విద్యా కానుక ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చదవండి : మరణదిన వేడుకలకు హాజరుకండి.. మాజీ మంత్రి సంచలన ఆహ్వాన లేఖ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ‘డిజిటల్‌’బోధన ఉండేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పీపీ–1 నుంచే ప్రారంభించాలని.. ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం కల్పించేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది కూడా. అలాగే నాడు నేడు రెండోదశ కింద 22,344 స్కూళ్లలో ఇప్పటికే పనులు నడుస్తున్నాయి.

మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, టీచర్లకు బైజూస్‌ ప్రీమియం కంటెంట్‌తో ప్రీలోడ్‌ చేయబడిన ట్యా బ్‌లను ఈనెల 21నుంచి 27వతేదీవరకు పంపిణీ చేస్తున్నట్లు డీఈవో వి.శేఖర్‌ తెలిపారు. దీనికోసం 1400 కోట్ల రూపాయలను వెచ్చించింది.

ఇదీ చదవండి : స్వామి వారికి సమర్పించే కానుకల్లో భారీగా విదేశీ కరెన్సీ.. ఏ దేశ కరెన్సీ ఎక్కువంటే..?

ఇందులో ట్యాబ్ ధర 15 వేల విలువ ఉంటుందని, కంటెంట్‌తో కలిపితే 30 వేల రూపాయల విలువ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఆయా ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, బయాలజీ, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల పాఠాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 8 భాషల్లో పాఠాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్థులకు సులభంగా సబ్జెక్టులు అర్థమయ్యేలా యానిమేషన్, వీడియో, ఆడియో కంటెంట్ ఇందులో ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools

ఉత్తమ కథలు