అన్న, చెల్లెళ్లు జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని మాత్రమే అందరికి తెలుసు. కాని ఏడాదిలో సోదర, సోదరి మధ్య ప్రేమానురాగాలు పంచుకునేందుకు మరొక పండుగ ఉంది. అదే భగిని హస్త భోజనం(Bhagini Hastabhojanam). ప్రతి ఏడాది దీపావళి(Diwali)పండుగ ముగిసిన రెండో రోజున ఈ పండుగను జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అసలు భగిని హస్త భోజనం అంటే ఏమిటి ..? ఈ పండుగ జరుపుకోవడానికి వెనుక పురాణ చరిత్ర ఏం చెబుతోందంటే దీపావళి ముగిసిన రెండ్రోజులకు సోదరుడు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇచ్చి ఆశీర్వదిస్తే ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పండుగ జరుపుకోవడానికి అసలు కారణం ఏమిటంటే..
భగిని హస్త భోజనం అంటే ..
హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. అలాగే పురాణ చరిత్ర కూడా దాగి ఉంటుంది. ముఖ్యంగా అన్న, చెల్లెళ్ల మధ్య ఉండే అనురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పౌర్ణమి. సోదరుడికి రాఖీ కట్టి దాన్ని రక్షాబంధన్‌గా కొలుస్తారు. అంటే సోదరికి అన్న రక్షణగా నిలవాలని ..అదే విధంగా అన్న, తమ్ముళ్లు బాగుండాలని..వారికి దీర్ఘాయువు కలగాలని సోదరి పూజ చేసి ఆ రోజున భోజనం పెడతారు. దీపావళి ముగిసిన రెండో రోజున భగిని హస్త భోజనం జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది.
సోదరుల ఆయుష్శ కోసం..
కార్తీకమాసంలోని శుక్లపక్షం రెండవ రోజున అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈసంవత్సవరం సూర్య గ్రహణం కారణంగా భగిని హస్తభోజనం దీపావళి ముగిన మూడో రోజు వచ్చింది. అంటే అక్టోబర్ 26వ తేది మధ్యాహ్నం 2.42గంటల నుంచి మరుసటి రోజు అనగా 27వ తేది మధ్యాహ్నం 12.42గంటల మధ్య కాలంలో ఈ భగిని హస్త భోజనం జరుపుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. అన్నా చెల్లెల పండగ రోజున మృత్యుదేవత యముడు తన సోదరి యమున వద్దకు వెళ్లి ఆమె చేతితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటాడని నమ్మకం. అందుకే ఈ పండుగను జరుపుకుంటారు.
సోదరుడికి సోదరి పెట్టే భోజనం..
యముడే సోదరి ప్రేమతో పెట్టిన భోజనం తీసుకుంటాడనే నానుడి కారణంగా తన సోదరుడికి దీర్ఘాయువు ప్రసాధించమని కోరుతూ చెల్లెళ్లు, అక్కలు తమ సోదరుడి కోసం ఈ భగిని హస్తభోజనం జరుపుతారు. సూర్యస్తమయం లోపే తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి సోదరుడ్ని ఇంటికి పిలిచి హారతి ఇచ్చి భోజనం పెడతారు. దీని ఫలితంగా సోదరుల ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.
కానుక ఇస్తే మంచిది..
సూర్య గ్రహణం కారణంగా ఈసంవత్సరం ఈ పండుగ జరుపుకోవడానికి అతి తక్కువ సమయం ఉన్నట్లుగా పంచాగంలో ఉంది. భగిని హస్తభోజనం చేసిన తర్వాత అక్క, చెల్లెళ్లకు సోదరుడు నూతన వస్త్రాలు, లేదంటే కానుక లేదంటే దక్షణి ఇస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Diwali 2022, Hindu festivals