Home /News /andhra-pradesh /

VIJAYAWADA BEST WEEKEND SPOT FUN ZONE AT PADMAVATHI GHAT EAT ENJOY ENTERTAINMENT IN VIJAYAWADA NGS VPR NJ

Vijayawada: అడ్వంచర్ లవర్స్ కు అది బెస్ట్ ప్లేస్.. వీకెండ్ వస్తే అక్కడ వాలిపోవాల్సిందే..?

ఫన్

ఫన్ అండ్ థ్రిల్

Vijayawada: వీకెండ్ వచ్చిందంటే..? చాలామంది ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉంటారు. అయితే అందులోనూ అడ్వంచర్ ఫీల్ పొందాలి అనుకునే వారికి.. స్వాగతం చెబుతోంది ఈ స్పాట్‌. ఫుల్ పన్ తో పాటు.. థ్రిల్ కూడా ఫీల్ అవుతారు.. ఇంతకీ ఈ పార్కు ప్రత్యేకత ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  Vijayawada:  మీరు అడ్వెంచర్స్ చేయడాన్ని ఇష్టపడతారా.? గాల్లోనే సైక్లింగ్‌ చేయాలనుకుంటున్నారా? వేసే ప్రతి అడుగులో థ్రిల్ ఫీల్ పొందాలని ఆశిస్తున్నారా..?  ఇంకెందుకు లేటు.. వెంటనే విజయవాడ పద్మావతి ఘాట్‌కు బయలుదేరండి మరి. నిజంగా అడ్వెంచర్ రైడ్స్ కోరుకునే వారికి సాదరస్వాగతం పలుకుతోంది విజయవాడలోని పద్మావతి ఘాట్‌. సాహసయాత్ర చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లడం. .ట్రెక్కింగ్‌లు, లాంగ్‌ డ్రైవ్‌లు అందరికి కుదరకపోవచ్చు. దీంతో చాలా మంది నిరుత్సాహ పడతుంటారు.. అలాంటి వారి కోసమే బడ్జెట్‌ ఫ్రెండ్లీలో విజయవాడలోనే ఒక ఫన్ జోన్ (FUN ZONE) ఏర్పాటు చేశారు. ఫన్‌ జోన్‌..ఫీల్‌ ద థ్రిల్‌ (Fun zone.. Feel the thrill) పేరుతో ఓ అడ్వంచెర్‌ గేమ్‌జోన్‌ను ఏర్పాటు చేశారు.

  ఈ ఫన్‌జోన్‌లో పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్‌ చేయోచ్చు. మీలో కాస్తంత ఆసక్తి, ధైర్యం ఉంటే చాలు…వయసుతో సంబంధం లేకుండా ఉల్లాసంగా గడపొచ్చు. ఫన్ జోన్‌లో రోప్ రైడ్ (Rope ride) , జిప్ సైకిల్‌ రైడ్ (ZIP Cycle road), రాకెట్ ఎజెక్టర్ (Rocket Ejector) … ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి . ప్రతి అడ్వెంచర్ రైడ్ ఊహకు అందని విధముగా ఉంటుందని నిర్వహుకులు కాంతారావు తెలియచేశారు.  పర్యాటకులను ఆకర్షించేందుకు..!                                                                  కృష్ణా నదికి ఉత్తరాన, పండిట్ నెహ్రూ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న పద్మావతి ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) ప్రైవేట్ కంపెనీ జాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో నాలుగేళ్ల క్రితం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ ప్రైవేట్‌ సంస్థ పిల్లల కోసం ప్లే జోన్, పెద్దల కోసం గేమ్ జోన్, అడ్వెంచర్ గేమ్‌లు, ఫుడ్ కోర్ట్‌లు, సాంస్కృతిక వేదికలు, వీకెండ్‌ కల్చరల్‌ ఈవెంట్స్‌ ( weekend cultural events)…ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.6 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.

  ఇదీ చదవండి : ఆ జిల్లాలో వైసీపీ బిగ్ షాక్.. పార్టీకి రాష్ట్ర కార్యదర్శి రాజీనామా..? అందుకేనా?

  కృష్ణ ,గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఇటు వంటి ఫన్‌ టైమ్‌ ప్లేసులు అందుబాటులో లేవు. అలా ఫన్‌తో పాటు అడ్వెంచర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రైడ్స్ ను పూర్తి భద్రత ప్రమాణాలను పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలియచేశారు. కేవలం పెద్ధలకే కాకుండా చిన్నరులకు కూడా డాషింగ్ కార్స్ (Dashing cars), ట్రామ్పోలిన్ (Trampoline), కృత్రిమ బోట్ షికారు (boat ride) , వర్చువల్‌ రియాలిటీ గేమ్స్ అండ్ అడ్వెంచర్ రైడ్‌లను ఏర్పాటుచేశారు.

  ఇదీ చదవండి : నేను విన్నాను నేను ఉన్నాను అంటున్న ఏయూ స్టూడెంట్.. అచ్చం జగన్ ను దింపేస్తున్నాడుగా.. మీరే చూడండి

  వీకెండ్స్ వస్తె వివిధ ప్రాంతాలు నుంచి వందల సంఖ్య లో పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా రోజు స్కూల్‌కు వెళ్లే పిల్లలు, ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు…వీకెండ్స్‌లో ఇక్కడికి వచ్చి రిలాక్స్‌ అవుతుంటారు. పిల్లలైతే మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తారంటే నమ్మండి.

  ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడంటే? అర్హులో కాదో చెక్ చేసుకోండి

  కావల్సినన్ని వెరైటీ ఫుడ్‌కోర్టులు                                                                  ఇక్కడ ఒక్క గేమ్స్‌ మాత్రమే కాదండి…మీకు కావల్సిన తినుబండారలన్నీ దొరుకుతాయి. సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ మాత్రమే కాదు చైనీస్‌, అరేబియన్‌, పంజాబ్‌, రాయలసీమ..మరెన్నో వెరైటీ ఫుడ్స్‌ ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన Peek-a-boo పేరుతో ఓ ఐస్‌క్రీమ్స్‌ కాంసెప్ట్‌ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల ఐస్‌ క్రీమ్‌లు, కేక్‌లు దొరుకుతాయ్‌.

  ఇదీ చదవండి: : టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆమె అక్కడి నుంచే బరిలో దిగుతారా..?

  పర్యాటకులు ఏమంటున్నారు?
  ఫన్‌జోన్‌లో ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన కావ్య మాటల్లో.. ‘సాధారణంగా ఇలాంటి అడ్వెంచర్ రైడ్స్ టీవీల్లో చూసేవాళ్లమని… గతంలో పోగో ఛానల్ ఇటువంటి అడ్వెంచర్స్ స్పోర్ట్స్ కార్యక్రమాలు ప్రసారం చేసేవాళ్ళు.. అవి చూసినపుడు ఇలాంటివి మనకు అందుబాటులో ఉంటే మనం కూడా ఒకసారి ప్రయత్నించవచ్చని చాలా సార్లు అనుకున్నాను...ఇప్పటికి నా కోరిక తీరింది..ఈ జిప్‌ సైకిల్‌ రైడ్‌ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. వీటితో పాటు మరిన్ని థ్రిల్లింగ్ రైడ్స్ ఏర్పాటు చేయాలని ఫన్‌జోన్‌కు వచ్చిన పలువురు పర్యాటకులు తెలిపారు.

  ఇదీ చదవండి: టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆమె అక్కడి నుంచే బరిలో దిగుతారా..?

  ఈట్‌..ఎంజాయ్‌..ఎంటర్‌టైన్‌మైంట్‌ :

  ఈట్‌ .. ఎంజాయ్‌.. ఎంటర్‌టైన్‌మైంట్‌ (Eat- Enjoy- Entertainment) అనే కాంసెప్ట్‌తో కృష్ణానది ఒడ్డున పద్మావతి ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఈ స్పాట్‌… ఇప్పుడు నగరవాసులకు ఫేవరెట్‌ ప్లేస్‌గా మారింది. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు..మరోవైపు ఈ ఫన్‌జోన్‌లో పిల్లల కేరింతలు…ఆ ప్లేస్‌కు వెళ్తే మనకున్న అన్ని టెన్షన్స్‌ నుంచి రిలీఫ్‌ దొరుకుతుంది. ఈ నదీ తీరాన ఆహ్లాదకర వాతావరణంలో ఫ్యామిలీ, పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేయడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. ఫన్‌జోన్‌లో మీకు నచ్చింనంత సేపు ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి వచ్చి …పక్కనే ఉన్న ఈ-3 ఫుడ్‌ కోర్టులో మీకు నచ్చిన ఫుడ్‌ను ఆరగించేసి ఆనందంగా ఇంటికెళ్లిపోవచ్చు. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు.. కానీ ఏ గేమ్‌ ఆడాలన్నా మాత్రం టికెట్‌ తీసుకోవాల్సిందే..! అది కూడా బడ్టెట్‌ ఫ్రెండ్లీగానే ఉంటుంది.  అడ్రస్‌: పద్మావతి ఘాట్‌, కృష్ణ లంక, పండిట్‌ నెహ్రు బస్టాండ్‌ ఎదురుగా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ - 520013.
  ఫోన్‌ నెంబర్‌: 7702111115.
  ఎలా వెళ్లాలి?
  విజయవాడ బస్టాండ్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఫుడ్‌ కోర్టు ఉంది. రైలు మార్గం ద్వారా అయితే విజయవాడ రైల్వేస్టేషన్‌ వరకు వచ్చి…అక్కడ నుంచి సిటీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు