హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: ఉల్లితో ఆరోగ్యమే కాదు..? రైతులకు భారీ లాభాలు.. కానీ ఇలా చేస్తేనే..?

Vijayawada: ఉల్లితో ఆరోగ్యమే కాదు..? రైతులకు భారీ లాభాలు.. కానీ ఇలా చేస్తేనే..?

X
ఉల్లిసాగుతో

ఉల్లిసాగుతో భారీ లాభాలు

Vijayawada: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. ఎందుకంటే ఉల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇది లేకుండా కూర వండితే ఆ టేస్టు మాత్రం రాదు.. అయితే ఉల్లి కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. రైతులకు సిరులు కూడా కురిపిస్తోంది. అయితే ఇలా సాగు చేస్తేనే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Pawan Kumar, News18, Vijayawada

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.. ఈ సామెత ఉట్టినే రాలేదు. అందుకు కారణం ఉల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజానలు (Health Benefits to Onion) ఉన్నాయి. ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలు మరెందులోనే లేవనే చెప్పాలి.. కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. ఆహా ఏమి రుచి అనేలా చేస్తుంది.. అందుకే ఫంక్షన్లు అన్నా.. రోజు వారి వంటలు అన్నా.. ఉల్లి లేని కూడా ఎప్పుడో కాని ఉండదు.. అందుకుతగ్గట్టే ఉల్లికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది.. చాలాసార్లు ఉల్లి కిలో సెంచరీ కూడా దాటింది. పచ్చి కూరలు సలాడ్ దగ్గర నుండి పచ్చళ్ళు,కూరలు వరకు అన్ని ఏదీ చేయాలి అన్నగాని ఉల్లి ని జోడిస్తేనే దానికి రుచి అందుతుంది. ఉల్లి తో పాటు ఉల్లి కాడలను కూడా కూరల్లో వాడతారు. అయితే ఇలా ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. రైతులకు సైతం సిరులు కురిపిస్తోంది.  అయితే ఇలా సాగుచేస్తేనే లాభాలు (Best Tips for Onion Farming).. లేదంటే నష్టాలు తప్పవు.

రైతు ఏదైనా ఒక పంట పండించాలి అంటే ఎంతో కష్ట పడతాడు ఎన్నో కష్టాలు పడుతూ, అప్పు తీసుకుని, పస్తులు ఉండి మరి అన్నిటినీ భరించి రైతు పంటను పండిస్తారు. కానీ ఆ పంట వలన ఒక్కోసారి లాభం ఒక్కోసారి నష్టం వస్తుంది. కానీ ఉల్లి వలన ఎక్కువగా నష్టాలే వస్తాయి.లాభాలు తక్కువగా వస్తుంటాయి.

సుగంధ ద్రవ్యాల్లో ఉల్లిగడ్డ ఒకటి.. తినే పదార్థాలకు రుచి కల్పించడానికి గాను వాడేవాటిలో ఉల్లి కూడా ఒకటి. ఉల్లికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఉల్లిలో రకాలు కూడా ఉన్నాయి. తెల్ల ఉల్లి, ఎర్ర ఉల్లి, సాంబార్ ఉల్లి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 7-3 కిలోల విత్తనం సరిపోతుంది. జూన్‌,జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి లో నాటాలి.

ఇదీ చదవండి : రైతలుకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

అక్టోబరు రెండో పక్షంలో నారు పోసి డిసెంబరు మొదటి వారంలో వేసవి పంటగా జనవరిలో నాటాలి. నాటడానికి దూరం 15:10 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి. చివరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 250.కిలోల వేపపిండి, జీవన ఎరువు 2 కిలోలు, ఫాస్ఫో బాక్టీరియా 2 కిలోలు వేసి నాటీ ముందు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్‌ 20-32 కిలోల భాస్వరం వేయాలి. నాటిన 30, 45 రోజులకు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్‌ చొప్పున వేయాలి. మొక్కలు పెరిగే దశలో 60 రోజుల వరకు 12-15 రోజులు వ్యవధిలో,గడ్డ ఊరే దశలో 5-6 రోజులకు తడుపుతూ ఉండాలి. కోతకు 15 రోజుల ముందు నీరు ఇవ్వడం ఆపివేయాలి.

ఇదీ చదవండి : ఈ పంటతో అందం.. ఆరోగ్యమే కాదు.. రెట్టింపు ఆదాయం కూడా..? ఎలా సాగు చేయాలి..? పెట్టుబడి ఎంత..?

పంట వేయడం ఒక వంతు ఐతే ఆ పంట చేతికి వచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉల్లి పంట ఉల్లి గడ్డలు రెడి అయ్యి పంట ఇంటికి రావాలంటే గడ్డలు పీకడానికి ముందు నీళ్ళు పెట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను, గడ్డకు కొన్ని సెం.మీ. వరకు కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తరువాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత ఉల్లి గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.

ఇదీ చదవండి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర.. వారికి తెలియకుండా స్కాం జరగదన్న సజ్జల

అలాగే పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 3-4 రోజులు పొలం మీదే ఎండబెట్టి తర్వాత 10-12 రోజులు నీడలో ఎండబెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగించవచ్చు.  ఈ ఉల్లి పంట వేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి కుదరదు అందులోనూ, ఏ నేల పడితే ఆ నేల లో ఉల్లి విత్తనాలు నాటకుడదు. నీరు నిల్వకుండా సారవంతమైన నెలలు ఉల్లి పంటకు అనుకూలంగా ఉంటాయి. ఉప్పగా ఉండే నీరు నిల్వ ఉండే నెలలు ఈ ఉల్లి పంట వేయడానికి పనికిరావు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Farmer, Local News, Onion, Vijayawada

ఉత్తమ కథలు