విజయవాడ వాసులకు గుడ్ న్యూస్... బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెడీ

ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెనపై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు

news18-telugu
Updated: February 2, 2020, 1:17 PM IST
విజయవాడ వాసులకు గుడ్ న్యూస్... బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెడీ
విజయవాడ వాసులకు గుడ్ న్యూస్... బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెడీ
  • Share this:
విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వంతెన రెడీ అయ్యింది. ఈ బ్రిడ్జ్‌పై రేపటి నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెనపై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న జాతీయ రహదారుల విభాగం సంచాలకుడు విద్యాసాగర్, ట్రాఫిక్ డీసీపీ నాగరాజులు వంతెనపై పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు సోమవారం మరోసారి వంతెనను పరిశీలించి వాహనాలకు పచ్చజెండా ఊపుతారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేతులు మీదుగా వంతెన ప్రారంభోత్సవం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

అయితే ముందుగా విజయవాడలో ఈ వంతెనను కేవలం నిర్మల కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి కూడలి వరకు పొడిగించాలన్న అప్పటి సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం స్పందించి అనుమతించింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అలాగే రూ.2వేల కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించినందున నగరంలో ట్రాఫిక్ రద్దీ తీరేందుకు బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ మరింత ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: February 2, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading