K Pawan Kumar, News18, Vijayawada
బీట్ రూట్ (Beat Rout) ఇది ఒక దుంప. ముల్లంగి, స్వీట్ పొటాటో, బంగాళా దుంప ఇలా ఇన్ని ఉన్నప్పటికీ అన్నిటికంటే మెరుగైన ఆరోగ్యమైన, అతి త్వరగా పంట చేతికి వచ్చేది మాత్రంబీట్రూట్ మాత్రమే. బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వలన రక్తం బాగా పట్టి డాక్టర్ వద్దకు వెళ్ళే పని ఉండదు అని చెప్పాలి. అలాగే ఈ బీట్రూట్ ని కూరలు గా, పచ్చళ్ళు, సలాడ్ రూపంలో తింటారు. అంతేకాదు బీట్రూట్ ఆకులు కూడా ఎంతో ఆరోగ్యం అని వాటిని కూడా సలాడ్ గా కూడా వాడతారు. బీట్రూట్ ఎంతో ఆరోగ్యం అనే చెప్పాలి. బీట్ రూట్ తినడమే కాదు.. సాగు చేసినా లాభాలు పొందవచ్చు.
బీట్ రూట్ పంట వేసే ముందు మంచి నేలను ఎంచుకోవాలి. అలాగే నేలను బాగా దున్నుకోని కాస్త నేల వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఈ పంట శీతాకాలం పంట అలాగే ఈ పంటను దఫా దఫాలుగా పండించుకుంటే దానికి తగ్గట్టుగాడిమాండ్ ఉంటుంది. అలా దఫాలుగా పంటను పండించాలంటే 15 నుండి 20 రోజులు తేడాతో నాటుకోవాలి. ఎకరాకు 3 నుండి నాలుగు కిలోలు వరకు విత్తనాలు చల్లాలి. నాటే సమయంలో విత్తుకి విత్తుకి మధ్య కాస్త దూరాన్ని పాటిస్తే సరిపోతుంది.
విత్తనాలు చల్లిన వెంటనే వాటికి కాస్త తడులు అందించాలి నీటిని ఎలా పడితే అలా అందించకుండా నీటిని బిందుసేద్య పద్ధతిలో అందిస్తే నీరు వృధా కాకుండా పంట ఎదగడానికి దోహదపడుతుంది. పంటకుపై తెగుళ్లతోపాటు దంపకు కూడా తెగుళ్లు ఆశిస్తాయి. మొక్కచుట్టూ నేలకు రంధ్రాలు పడితే దుంపకు తెగులు సోకినట్లు భావించాలి.
ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో కొందరు రైతులు బీట్ రూట్ సాగు చేస్తున్నారు. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో బసవయ్య అనే రైతు బీట్ రూట్ సాగు చేస్తున్నారు. ఎకరా బీట్ రూట్ సాగుకు విత్తనాలు, కూలీలు, ఎరువులు, పంట తీయడం వంటి పనులకు కలిపి రూ.15వేల వరకు ఖర్చవుతుంది. ఎకరాలకు 10-12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ.80వేల వరకు లాభం వస్తుందని రైతు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada