Andhra Pradesh: సోషల్ సర్వీసే ఆమె సిలబస్... చిన్నారులకు అండగా ఎన్నారై విద్యార్థిని

ఐశ్వర్య మంగం (ఫైల్)

మనం ఎంత సంపాదించినా సమాజానికి ఎంతోకొంత ఇవ్వాలి. ఇది సినిమాల్లో చెప్పుకోవడానికి బావుంటుంది. కానీ ఓ విద్యార్థిని మాత్రం చిన్నతనంలోనే ఈ మాటను నిజం చేసి చూపిస్తోంది.

 • Share this:
  సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. కొందరికి చేయాలని ఉన్నా.. సరైన వనరులు లేక వెనకుడుగు వేస్తుంటారు. మరికొందరికి సాయం చేసే స్థోమత ఉన్నా పట్టించుకోరు. ఇంకొందరు మాత్రం ఎలాగైనా సమాజానికి ఉపయోగపడే పనిచేయాలని తపిస్తుంటారు. ఇందుకోసం స్థోమత ఉందా లేదా అని ఆలోచించరు. తమ దగ్గరున్న విద్యనే ఆసరాగా చేసుకొని నలుగురికి ఉపయోగపడుతుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఐశ్వర్య. ఆమెరికాలో స్థిరపడినా జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న లక్ష్యంతో సామాజిక సేవ చేస్తోంది. విద్యార్థి దశ నుంచే సమాజ సేవను అలవాటుగా మార్చుకొని చిన్నారులకు భవిష్యత్తునిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మంగా నరసింహ, అరుణ దంపతులు 20 ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వారికి కుమార్తె ఐశ్వర్య స్థానికంగా ఓ స్కూల్లో చదువుకుంటోంది. నిత్యం పుస్తకాలతో కుస్తిపట్టకుండా సాటివారికి సాయం చేయాలన్న భావన కూడా ఆమెలో ఉండేంది. అదే లక్ష్యంతో మూడేళ్లుగా భారత్ లోని ఆటిజం, ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఆపన్న హస్తం అందిస్తోంది. వారి జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది.

  ఇది చదవండి: ఏపీలో స్వచ్ఛంద లాక్ డౌన్... కరోనా కట్టడికి ముందుకొచ్చిన జనం.. ఎక్కడో తెలుసా..?


  అటిజం, మానిసిక వికలాంగులైన చిన్నారులకు నిత్యం ఎవరో ఒకరు తోడుండాలి. అలాంటి అవసరం లేకుండా టెక్నాలజీ, ఇతర వైద్య పరికరాలతో వారికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఐశ్వర్య పనిచేస్తోంది. లక్ష్యమైతే ఉంది గానీ దానికి ఆర్ధికంగా ప్రోత్సాహం అవసరమైంది. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా తనకు వచ్చిన విద్యపైనే ఆధారపడింది. ఐశ్వర్య స్వతహాగా కూచిపూడి డాన్సర్. అంతేకాదు హిప్ హాప్ లాంటి వెస్ట్రన్ డాన్సుల్లోనూ ఆరితేరింది. అమెరికాలో జరిగిన పలు స్టేట్, నేషనల్ లెవల్ డాన్స్ కాంపిటిషన్లలో పాల్గొని అవార్డులు సాధించింది.

  ఇది చదవండి: అమ్మకానికి 130 ఏళ్ల రైల్వే నాటి రైల్వే స్టేషన్… రండి బాబు రండి..  తన లక్ష్యానికి తనలో ఉన్న టాలెంట్ ను ఫ్లాట్ ఫామ్ గా చేసుకున్న ఐశ్వర్య డాన్స్ క్లాసులు నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సోషల్ సర్వీస్ కు ఉపయోగించాలని భావించింది. ఈ లోగా కరోనా రావడం లాక్ డౌన్ విధించడంతో క్లాసులకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి చారిటీకి అవసరమైన డబ్బును సంపాదిస్తోంది. ఇందులో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వామ్యమైంది. భారత్ లోని ఆశాజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆశాజ్యోతి అనే సంస్థ భారత్ లో దివ్యాంగులు, దివ్యాంగులైన అనాధ బాలల కోసం పనిచేస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య.. ఆశ్యాజ్యోతి స్వచ్ఛంద సంస్థ ద్వారా వందలాది మంది ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు వీల్ చైర్లు, ఇతర వైద్య పరికరలాను అందించింది. ఆన్ లైన్ డాన్స్ వర్క్ షాపుల ద్వారా వేలాది డాలర్లను విరాళంగా సేకరిస్తున్న ఐశ్వర్య భవిష్యత్తులో మరింత మందికి అండగా ఉంటానని చెప్తోంది.
  Published by:Purna Chandra
  First published: