Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
సంక్రాంతి (Sankranthi) బరిలో తొడగొట్టి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.. అయితే ముఖ్యంగా సినిమాలో పొలిటికల్ డైలాగ్ లు ఓ రేంజ్లో పేలాయి అంటున్నారు.. అది కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని ఉద్దేశించిన.. బాలయ్య బాబు పేల్చిన డైలాగ్స్ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించేలా చేసిందని టాక్ వచ్చింది. ముఖ్యంగాముఖ్యంగా రెండు డైలాగ్ లు అయితే విజిల్స్ వేసేలా చేస్తున్నాయి అంటున్నారు.
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు అనే అనే డైలాగ్ ఏపీ ప్రభుత్వానికి కౌంటర్‌గా ఉంది అంటున్నారు. అలాగే పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ అనే డైలాగ్ కూడా జగన్‌ను ఉద్దేశించినట్లు చెప్పిందిగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఈ డైలాగులు నెట్టింట్లో ట్రెండ్‌గా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తెలుగు దేశం పార్టీలోనూ ఫుల్ జోష్ నింపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు ఈ సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. బాలయ్య సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కేవలం దాన్ని సినిమాగానే చూసేవారు.. కానీ ఈ సారి దీన్ని పొలిటికల్ అంశంగా చూస్తున్నారు. అందులోనూ జగన్ కు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండడంతో ఈ సినిమా పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఇదీ చదవండి : తిరుమలలో వసతి గృహాల అద్దె పెంపుపై ఆగని దుమారం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తెలుగు దేశం పార్టీ నేతలు చాలామంది ఎక్కడికక్కడ బాలయ్య బ్యానర్లు కట్టి.. సందడి చేస్తున్నారు. అలాగే కీలక నేతలంతా తొలి రోజే సినిమా చూసి..బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా సూపర్ హిట్ అవుతుందని.. వైసీపీ నేతలకు కౌంటర్లు వేస్తున్నారు.
ఇదీ చదవండి : సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ.. ఏం చేయబోతున్నారంటే..?
ముఖ్యంగా సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్ లకు అన్ని వర్గా్లప్రేక్షకులను నుంచి మంచి స్పందన వస్తోంది. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. ప్రగతి సాధించడం అబివృద్ది - ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ది- భిచ్చమేయడం కాదు. అభివృద్ధి పనులు ఆపడం అభివృద్ది కాదు. నిర్మించడం అభివృద్ది, కూల్చడం కాదు.. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ది-ఉన్న పరిశ్రమలు మూసివేయడం అబివృద్ది కాదు.ఇక సీఎం జగన్ కు వ్యతిరేకంగా సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కు ఎక్కువగా క్లాప్స్ పడుతున్నాయి అంటున్నారు. అందుకే టీడీపీఫుల్ జోష్ లో ఉంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Local News, Nandamuri balakrishna, Veera Simha Reddy