హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Auto Drivers Problems: ఆటో డ్రైవర్లకు మరో కొత్త కష్టం.. కారణం ఏంటో తెలుసా..?

Auto Drivers Problems: ఆటో డ్రైవర్లకు మరో కొత్త కష్టం.. కారణం ఏంటో తెలుసా..?

X
ఆటో

ఆటో డ్రైవర్లకు కొత్త కష్టం.. కారణం ఇదేనట..

Auto Drivers Problems: ఆటో డ్రైవర్లకు రోజు రోజుకూ కష్టాలు పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో సమస్యలు వెంటాడుతున్నా.. ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Sai Trinath, News18, Vijayawada

Auto Drivers Problems: ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన, ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేవి ఆటోలే.. రైల్వే స్టేషన్ (Railway Station) అయినా.. బస్ స్టాండ్ (Bus Stand) అయినా..? జనావాసాలకైనా ఎక్కువమంది.. ప్రయాణం చేసే వాహనం ఆటో (Journey in Auto) .. దాదాపు అన్ని ప్రాంతంలో ఆటోలు తిరుగుతూ కనిపిస్తుంటాయి.  అయితే ఆటో డ్రైవర్లలో కొందరు చదువుకునే వారు ఉండొచ్చు.. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఉన్న గణంకాల ప్రకారం.. పెద్ద చదువులు చదువుకోని వారే ఆటో డ్రైవర్లుగా ఉన్నారనే అంచనా ఉంది.  కొంత మందికి టచ్ అలాగే స్మార్ట్ ఫోనులు వాడటం రాని వారు కూడా ఉన్నారు  అన్నది అతిశయోక్తి కాదు.

ర్యాపిడో, ఉబర్, ఓలా ఆటో రైడ్ రిజర్వేషన్ వలన సాధారణంగా నగరంలో ఆటో తోలుకునేవారు ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులు కానీ, సాధారణ ప్రజానీకం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోనులను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అని అడగానే ఉబర్ రైడ్ బుక్ చేసుకున్నామని లేదా రాపిడో రైడ్ బుక్ చేసుకున్నామని సమాధానం చెప్తున్నట్లు సాధారణ ఆటో డ్రైవర్లు తమ ఆవేదనను వ్యక్త పరిచారు.

విజయవాడ నగరంలో సుమారు లక్షకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. వాటిలో సగం ఆటోలకు పైగా రాపిడో, ఉబర్ మరియు ఓలా ప్రీ రైడ్ బుకింగ్స్ కు పని చేస్తున్నాయి. ఈ ప్రీ రైడ్ బుకింగ్ ఆటోల వలన చదువు రాని, స్మార్ట్ ఫోనులు వాడలేని సాధారణ ఆటో డ్రైవర్లు ప్రయాణికులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి : ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తోంది.. సవితమ్మ సంకల్పానికి సెల్యూట్

ఆటో డ్రైవర్లలో ఎంతో మంది చదువు రాని, స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించలేని వారు సాధారణ ప్రయాణికుల కోసం గంటల గంటల సమయం వేచి చూడాలిసి వస్తుందని, ఎవరు పట్టిన, ఎంత మంది ప్రయాణికులను అడిగిన స్మార్ట్ ఫోనులు ఉండడంతో రాపిడో, ఉబర్, ఓలా ఆటోలనే సందర్శిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం రాపిడో, ఉబర్, ఓలా ఆటోలను అడ్డుకొని, నిరక్షరాస్యత, స్మార్ట్ ఫోనులు వాడలేనటువంటి సాధారణ ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలి అని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి : భయపెడుతున్న రోహిణి కార్తె.. రెట్టింపు అవుతున్న భానుడి భగభగలు.. ఎందుకంటే..?

ఆటో డ్రైవర్ చిన్న మాట్లాడుతూ వీరు చదువుకోని, స్మార్ట్ ఫోనులు వాడలేని సాధారణ ఆటో డ్రైవర్లలో ఒకరని తెలిపారు. వీరు నడిపే ఆటోలు సిటీ పర్మిట్ ఆటోలని, నగరంలోనే వివిధ ప్రాంతాలకు ఆటో నడుపుతానని తెలిపారు. ఉబర్, రాపిడో, ఓలా ప్రీ రైడ్ బుకింగ్స్ , నగరం బయట ఆటోల కారణంగా వీరికి రోజురోజుకు వచ్చే అదాయం వారికి ఏ విధంగా సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada

ఉత్తమ కథలు